E-Paper
Advertisement

Infinix Note 50s 5G: రూ.15 వేల లోపే అదిరిపోయే ఇన్‌ఫినిక్స్ కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Infinix Note 50s 5G: రూ.15 వేల లోపే అదిరిపోయే ఇన్‌ఫినిక్స్ కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Advertisement

Infinix Note 50s 5G: ఇన్‌ఫినిక్స్ బ్రాండ్ ఇండియా మార్కెట్‌లో మరో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. మిడ్ రేంజ్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఇన్‌ఫినిక్స్ నోట్ 50స్ 5జీ, డిజైన్ నుంచి డిస్‌ప్లే వరకూ మంచి అప్‌డేటెడ్ లుక్‌తో కనిపిస్తోంది. తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ అమోలెడ్ స్క్రీన్ కావాలనుకునే వారికి ఈ ఫోన్‌ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. రోజువారీ వాడకం నుంచి గేమింగ్ వరకూ అన్ని అవసరాలకు సరిపడేలా ఈ ఫోన్‌‌ను డిజైన్ చేశారు.

డిస్‌ప్లే అనుభవం

Advertisement

ఈ ఇన్‌ఫినిక్స్ నోట్ 50s 5జీ లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. ముఖ్యంగా 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వలన స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. వీడియోలు చూసేటప్పుడు కలర్స్ బాగా పాప్ అవుతాయి. గేమ్స్ ఆడేటప్పుడు కూడా ల్యాగ్ అనిపించకుండా మంచి అనుభవం ఇస్తుంది. ఈ ధర సెగ్మెంట్‌లో 144Hz అమోలెడ్ స్క్రీన్ రావడం నిజంగా ప్లస్ పాయింట్.

పర్‌ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్

Advertisement

ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్ అందించారు. డైలీ యాప్స్ వాడకం, మల్టీటాస్కింగ్ సమయంలో ఫోన్ స్పీడ్‌గా స్పందిస్తుంది. 5జీ సపోర్ట్ ఉండటం వలన ఫ్యూచర్ యూజ్‌కు కూడా ఇది రెడీగా ఉంటుంది. స్టోరేజ్ పరంగా కూడా యూజర్‌కు సరిపడా స్పేస్ లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ బాగానే ఉండటం వలన సాధారణ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉండదు.

Also Read: Samsung Galaxy Z Fold 6: రూ. 1.65 లక్షల ఫోన్ ఇప్పుడు లక్షకే.. అమెజాన్‌లో శామ్‌సంగ్ క్రేజీ ఆఫర్

బ్యాటరీ పవర్

ఇన్‌ఫినిక్స్ నోట్ 50s 5జీ లో 5500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే నార్మల్ యూజ్‌లో ఒక రోజు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, కాల్స్ ఎక్కువగా చేసే వారికి ఈ బ్యాటరీ చాలా ఉపయోగపడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం వలన తక్కువ సమయంలోనే మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

కెమెరా ఫీచర్స్

ఈ ఫోన్ కెమెరా సెటప్ కూడా డైలీ ఫోటోగ్రఫీకి సరిపడేలా ఉంది. డేలైట్ ఫోటోలు క్లియర్‌గా వస్తాయి. సెల్ఫీ కెమెరా కూడా సోషల్ మీడియా యూజర్లకు సరిపడే క్వాలిటీ ఇస్తుంది. వీడియో కాల్స్ చేసేవారికి కూడా ఇది ఓకే లెవల్ అనిపిస్తుంది.

ఇండియాలో ధర ఎంతంటే?

ఇన్‌ఫినిక్స్ నోట్ 50s 5జీ ఇండియాలో అఫోర్డబుల్ ధరలోనే లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర సుమారు రూ. 14,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియా లాంచ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. తక్కువ ధరలో 144Hz అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబీ ర్యామ్ కావాలనుకునే వారికి ఈ ఇన్‌ఫినిక్స్ నోట్ 50s 5జీ ఒక మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు కావాలని అనుకునే వారికి, గేమింగ్ ప్రియులకు ఈఫోన్ పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×