E-Paper
Advertisement

గేమింగ్ ట్రిగ్గర్స్, ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్.. మార్కెట్లోకి వచ్చేసిన Infinix GT 50 Pro!

గేమింగ్ ట్రిగ్గర్స్, ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్.. మార్కెట్లోకి వచ్చేసిన Infinix GT 50 Pro!
Advertisement

Infinix GT 50 Pro Launched: గేమింగ్ అంటే పడిచచ్చే కుర్రాళ్ల కోసం ప్రముఖ ఇన్ఫినిక్స్ సంస్థ ఒక క్రేజీ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. అదే Infinix GT 50 Pro. గతంలో వచ్చిన GT 30 Proకి అప్‌డేటెడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ ఫోన్.. పక్కా గేమింగ్ ఫోకస్‌తో తయారైంది. ఏఐ టూల్స్, అదిరిపోయే స్పీడ్ వంటి ఫీచర్లతో మొబైల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్‌ను ఇది నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని చెప్పొచ్చు.

భారత్‌లోకి ఎప్పుడంటే?

ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను ఇండోనేషియాలో రిలీజ్ చేశారు. దీని ధర సుమారు రూ.38,300 (12GB+256GB మోడల్) నుంచి మొదలవుతోంది. బ్లాక్, రెడ్, సిల్వర్ వంటి మూడు క్రేజీ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. అయితే మన ఇండియాలో ఇది వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర కూడా మన బడ్జెట్‌కు తగ్గట్లుగా రూ.35,000 లోపే ఉండొచ్చని మార్కెట్ వర్గాల టాక్.

Advertisement

Also Read: Vivo T5x 5Gపై సూపర్ ఆఫర్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ కొనలేరు బ్రో!

ఐదేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్:

Infinix GT 50 Proలో 6.78 ఇంచుల పెద్ద అమోలెడ్ డిస్ప్లేను వాడారు. దీని రిఫ్రెష్ రేట్ 144Hz ఉండటం వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోన్ పవర్‌ఫుల్‌గా పనిచేయడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్‌ను వాడారు. దీనివల్ల ఫోన్ ఎంత వాడినా హ్యాంగ్ అవ్వదు. మరో మంచి విషయం ఏంటంటే.. ఈ ఫోన్ కొంటే మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్:

Advertisement

గేమర్ల కోసం ఈ Infinix GT 50 Proలో ఫిజికల్ షోల్డర్ ట్రిగ్గర్స్ ఇచ్చారు. ఇవి షూటింగ్ గేమ్స్ ఆడేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. ఇక గంటల తరబడి గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా ఉండేలా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని వాడారు. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. వెనుక 50MP మెయిన్ కెమెరా, ముందు సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉన్నాయి. దీనితో 4K వీడియోలు కూడా తీసుకోవచ్చు.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

గేమ్స్ ఆడేటప్పుడు ఛార్జింగ్ అయిపోతుందనే భయం లేకుండా ఈ ఫోన్‌లో ఏకంగా 6500mAh బ్యాటరీని పెట్టారు. దీనికి 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే.. గేమింగ్ పిచ్చి ఉన్నవారికి తక్కువ ధరలో ఒక పవర్‌ఫుల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందనే చెప్పాలి.

Also Read: 144Hz డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ సెన్సార్‌తో రానున్న Vivo X500 సిరీస్.. ఫీచర్లు అదరహో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×