// // Induction Stove vs Infrared Stove: ఏ స్టవ్ వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది? -->
E-Paper
Advertisement

Induction Stove vs Infrared Stove: ఇండక్షనా లేక ఇన్‌ఫ్రారెడ్ స్టవా? ఈ ఒక్క తేడా తెలుసుకుంటే డబ్బు వృధా కాదు!

Induction Stove vs Infrared Stove: ఇండక్షనా లేక ఇన్‌ఫ్రారెడ్ స్టవా? ఈ ఒక్క తేడా తెలుసుకుంటే డబ్బు వృధా కాదు!
Advertisement

Induction Stove vs Infrared Stove: కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా కరెంటుతో నడిచే ఇండక్షన్ స్టవ్‌లకు భలే డిమాండ్ ఏర్పడింది. అయితే మంచి ఇండక్షన్ స్టవ్ కొందామని మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఇండక్షన్ స్టవ్, ఇన్‌ఫ్రారెడ్ స్టవ్ అని రెండు రకాలు కనిపిస్తాయి. వీటి మధ్య తేడాలు తెలియక చాలామంది అయోమయానికి గురవుతుంటారు. పైకి రెండూ ఒకేలా కనిపించినా, వీటి పనితీరులో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్టవ్‌ల మధ్య ఉన్న తేడాలు ఏమిటి? ఏది వాడితే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వంటకు ఏది ఉత్తమం?

సాధారణ ఇండక్షన్ స్టవ్ అనేది అయస్కాంత తరంగాల ద్వారా పనిచేస్తుంది. దీనిపై గిన్నె పెట్టినప్పుడు మాత్రమే అది వేడెక్కుతుంది. స్టవ్ మీద ఉండే గ్లాస్ నేరుగా వేడెక్కదు. దీనివల్ల వంట చాలా వేగంగా పూర్తవుతుంది. ఇక ఇన్‌ఫ్రారెడ్ స్టవ్ విషయానికి వస్తే.. దీనిలో ఉండే కాయిల్ మొదట వేడెక్కి ఆ వేడిని గ్లాస్ ద్వారా గిన్నెకు అందిస్తుంది. అలాగే ఇండక్షన్‌ మీద కేవలం స్టీల్ లేదా ఇనుప గిన్నెలు మాత్రమే వాడాలి. కానీ ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌పై అల్యూమినియం, మట్టి పాత్రలు, గాజు గిన్నెలు ఇలా దేనినైనా వాడుకోవచ్చు.

Advertisement

Also Read: ఇంటికెళ్లే సరికి వంట రెడీ చేసి పెట్టే ఎలక్ట్రిక్ కుక్కర్.. మొబైల్‌తో ఆపరేట్ చేస్తే చాలు!

కరెంట్ బిల్లు ఆదా చేయాలంటే?

మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది ఎంత కరెంట్‌ను ఖర్చు చేస్తుందో అని ఆలోచిస్తాం కదా. ఈ ఇండక్షన్ స్టవ్ చాలా తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది. ఎందుకంటే.. అది నేరుగా గిన్నెను మాత్రమే వేడి చేస్తుంది. ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లో గ్లాస్ వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కరెంటు బిల్లు కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఎక్కువ రకాల వంటలు వండేవారైతే ఇండక్షన్ స్టవ్ కొనుగోలు చేయడం ఉత్తమం. దీంతో కొంత డబ్బు కూడా ఆదా అవుతుంది.

ఏ స్టవ్ సేఫ్?

Advertisement

వంట చేసేటప్పుడు భద్రత చాలా ముఖ్యం. ఇండక్షన్ స్టవ్‌పై గిన్నె తీసేయగానే వేడి ఆగిపోతుంది. గ్లాస్ కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి.. పొరపాటున చెయ్యి తగిలినా ఏమీకాదు. కానీ ఇన్‌ఫ్రారెడ్ స్టవ్ ఆపేసిన తర్వాత కూడా గ్లాస్ చాలా సేపు వేడిగా ఉంటుంది. దీంతో చెయ్యి కాలే ప్రమాదం ఉంటుంది. ఇక మన్నిక పరంగా చూస్తే ఇండక్షన్ స్టవ్ ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లో గ్లాస్ విపరీతంగా వేడెక్కడం వల్ల కొన్నిసార్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

వంట వేగంగా అవ్వాలంటే?

మీ ఇంట్లో ఇప్పటికే స్టీల్ పాత్రలు ఉండి, వేగంగా వంట పూర్తి కావాలని కోరుకుంటే ఇండక్షన్ స్టవ్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ పాత అల్యూమినియం గిన్నెలే వాడాలి అనుకుంటే ఇన్‌ఫ్రారెడ్ స్టవ్ తీసుకోవచ్చు. అయితే నాణ్యత, భద్రత, విద్యుత్ ఆదాను దృష్టిలో పెట్టుకుంటే ఇండక్షన్ స్టవ్ ఎంచుకోవడమే తెలివైన పని.

Also Read: వంట గ్యాస్ సిలిండర్లు రెడ్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి? మిగతా రంగుల సిలిండర్లు దేనికి వాడతారు?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ప్రయోజనాలు.. ఆయా కంపెనీలపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×