E-Paper
Advertisement

ఇండక్షన్ వాడుతున్నారా? ఈ టెంపరేచర్ సెట్టింగ్స్ తెలియకపోతే.. కరెంట్ బిల్లు మోత మోగుతుంది

ఇండక్షన్ వాడుతున్నారా? ఈ టెంపరేచర్ సెట్టింగ్స్ తెలియకపోతే.. కరెంట్ బిల్లు మోత మోగుతుంది
Advertisement

Induction Cooking Temperature: ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్ వాడకం రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ ఇండక్షన్ పై వంట చేసేటప్పుడు సరైన సెట్టింగ్స్ తెలియకపోతే.. మాత్రం వంట రుచిలో మార్పులు రావడం,లేదా మాడిపోవడం వంటివి సాధారణం. ఇదిలా ఉంటే చాలా మంది వంట త్వరగా పూర్తవ్వాలని ఇండక్షన్‌పై ఎక్కువ టెంపరేచర్‌తో వంటలు చేస్తుంటారు.నిజానికి దీనిపై వంట రుచిగా రావాలంటే మాత్రం టెంపరేచర్ కంట్రోల్ చాలా ముఖ్యం అనే చెప్పాలి. సరైన వాటేజ్‌తో పాటు సరైన పద్దతి పాటించినప్పుడు మాత్రమే వంట రుచిగా రావడంతో పాటు స్టవ్ కూడా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇంతకీ ఇండక్షన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సీక్రెట్ టెంపరేచర్ సెట్టింగ్స్ ఏంటి ? వీటి వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండక్షన్ స్టవ్ టెంపరేచర్ కంట్రోల్ ఎందుకు ముఖ్యం:
ఇండక్షన్ నేరుగా పాత్రలోపలి భాగానికి మాత్రమే వేడిని అందిస్తుంది. ఇది గ్యాస్ స్టవ్ లాగా కాకుండా నేరుగా పాత్ర బేస్ ను వేడిచేస్తుంది. అందుకే టెంపరేచర్ కంట్రోల్ చేయాలి. లేకపోతే  ఆహారం త్వరగా మాడిపోతుంది. ముఖ్యంగా అన్నం, పులావ్ ,ఫ్రై, డ్రై కర్రీలు త్వరగా కింద మాడిపోయే ప్రమాదం ఉంటుంది.

Advertisement

ఐడియల్ టెంపరేచర్ సెట్టింగ్స్ ఏంటి?
సాధారణంగా ఇండక్షన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ పద్దతిని పాటించాలి. లేకుంటే కరెంట్ బిల్లు పెరగడమే కాకుండా మీ టైం కూడా వృథా అవుతుంది. వంటలు మాడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

లో ప్లేమ్:
(300–500W | 100°C–120°C)-పప్పు, కూరలు, అన్నం వండేందుకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

Advertisement

మీడియం ఫ్లేమ్ :
(800–1000W | 140°C–160°C)- సాధారణ వంటలకు ఇది బెస్ట్ టెంపరేచర్

హై ఫ్లేమ్:
(1200W పైగా)-నీళ్లు మరిగించేందుకు మాత్రమే దీనిని ఉపయోగించాలి.

ఎందుకు ఫుల్ టెంపరేచర్ వాడకూడదు?
ఇండక్షన్‌ను ఎప్పుడూ ఫుల్ పవర్‌లో వాడటం వల్ల వచ్చే సమస్యలు..

1.వంట మాడిపోయే అవకాశం ఉంటుంది.
2.రుచిలో మార్పు వస్తుంది.
3.పాత్ర మాడిపోతుంది.
4.ఇండక్షన్ లోపలి PCB దెబ్బతినే అవకాశం ఉంటుంది.
5.కరెంట్ బిల్లు పెరుగుతుంది.

వంట ప్రకారం టెంపరేచర్ ఎలా మార్చాలి?
ప్రతి వంటకానికి వేర్వేరు సెట్టింగ్స్ అవసరం..

1.అన్నం, పప్పు → 400–600W
2.కూరలు → 500–800W
3.ఫ్రైలు → 800–1000W
4.నీళ్లు మరిగించడానికి → 1200W

ఇండక్షన్‌ కోసం ఎలాంటి పాత్రలు వాడాలి?

1.మందంగా ఉండే బేస్ ఉన్న పాత్రలు వాడాలి.
2.పలుచని బేస్ ఉంటే త్వరగా ఆహారం మాడిపోతుంది.
3. ఇండక్షన్ కంపాటబుల్ పాత్రలు మాత్రమే ఉపయోగించాలి.

Also Read: మిడిల్ క్లాస్ బడ్జెట్‌కి సరిపోయే.. బెస్ట్ వాషింగ్ మెషీన్లు, ఆఫర్ చూస్తే ఆగలేరు

ఇండక్షన్ వాడేటప్పుడు పాటించాల్సిన టిప్స్:

1.మొదట 600W టెంపరేచర్లో వంట ప్రారంభించండి.
2.అవసరాన్ని బట్టి టెంపరేచర్ పెంచండి లేదా తగ్గించండి.
3. వంట మధ్యలో కలుపుతూ ఉండాలి.
4. ఖాళీ గిన్నెలను ఇండక్షన్‌పై ఎక్కువసేపు వేడి చేయకండి.

ఇండక్షన్ స్టవ్ వాడకం ఈజీ కానీ టెంపరేచర్ సెట్టింగ్స్ పై అవగాహన లేకపోతే వంట రుచి తగ్గుతుంది. 500W నుంచి 800W మధ్య వాడటం చాలా సందర్భాల్లో బెస్ట్. సరైన పద్ధతిలో వాడితే వంట రుచిగా రావడంతో పాటు మీ ఇండక్షన్ స్టవ్ కూడా ఎక్కువ రోజులు పనిచేస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×