E-Paper
Advertisement

Antibiotic : మొండి బ్యాక్టీరియాను గుర్తించే కొత్త సాధనం..!

Antibiotic : మొండి బ్యాక్టీరియాను గుర్తించే కొత్త సాధనం..!
Advertisement
Antibiotic

A new tool for identifying resistant bacteria : చిన్న జ్వరం వచ్చినా.. పడిశెం పట్టినా.. యాంటీబయాటిక్స్‌ను వాడేయడం పరిపాటి. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ను వినియోగించడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు లొంగడం లేదు. కాలక్రమంలో పరిణామం చెందుతూ యాంటీబయాటిక్స్‌ను ఎదిరించి జీవించగల శక్తిసామర్థ్యాలను అవి సంతరించుకోగలుగుతున్నాయి. మరి వీటిని గుర్తించేదెలా? అలాంటి బ్యాక్టీరియాకు కళ్లెం వేయడం సాధ్యమేనా?

ఈ దిశగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc), జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ సైంటిఫిక్ రిసెర్చ్(JNCASR) పరిశోధకులు కీలక ముందడుగు వేయగలిగారు. యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని జీవించగల బ్యాక్టీరియాను గుర్తించేందుకు కొత్త పద్ధతిని కనుగొన్నారు. యాంటీబయాటిక్స్‌కు సైతం బ్యాక్టీరియా లొంగకపోవడమే ఇప్పుడు వైద్య పరిశోధకులకు పెనుసవాల్ విసురుతోంది.

Advertisement

Read more: తక్కువ ధరలోనే నథింగ్ ఫోన్ (2a).. లాంచ్ ఎప్పుడంటే..?

ఈ-కొలి(E. coli), స్టాఫిలోకోకస్ ఆరియస్ (Staphylococcus aureus) వంటి బ్యాక్టీరియాల వల్ల ఏటా పదిలక్షల మంది మృత్యవాత పడుతున్నారు. అలాంటి వాటిని వేగంగా గుర్తించే పద్ధతిని భారత పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ప్రకాశవంతమైన కాగిత ఆధారిత ప్లాట్ ఫామ్ ద్వారా యాంటీబయాటిక్-రెసిస్టెంట్ బ్యాక్టీరియాను గుర్తిస్తారు.

Advertisement

మందులకు లొంగని బ్యాక్టీరియాను సాధారణంగా రక్తం, మూత్ర పరీక్షల ద్వారా నిర్థారిస్తారు. అయితే అందుకు చాలా సమయం పడుతుంది. ఆ సమయాన్ని తగ్గించడంపైనే తాము దృష్టి సారించి కొత్త పద్ధతిని ఆవిష్కరించామని ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ ఉదయ్ మిత్ర వెల్లడించారు. మూత్రాన్ని పరీక్షించడం ద్వారా అలాంటి బ్యాక్టీరియాను ఈ విధానంలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే గుర్తించొచ్చు. ఇందుకోసం IISc, JNCASR పరిశోధకుల బృందం ఇల్యుమినేట్ ఫ్లోరసెన్స్ రీడర్‌ను అభివృద్ధి చేసింది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×