E-Paper
Advertisement

చైనా బ్రాండ్లకు చెక్.. భారత్‌లో ఇకపై ఈ 5 మేక్ ఇన్ ఇండియా CCTV కెమెరాలదే హవా!

చైనా బ్రాండ్లకు చెక్.. భారత్‌లో ఇకపై ఈ 5 మేక్ ఇన్ ఇండియా CCTV కెమెరాలదే హవా!
Advertisement

Make In India CC TV: మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, భద్రత కోసం ప్రస్తుతం ప్రతి ఇంట్లో, ఆఫీసులో సీసీటీవీ కెమెరాలు కామన్ అయిపోయాయి. అయితే ఇప్పటివరకు మార్కెట్‌లో తక్కువ ధరకే దొరుకుతున్నాయి కదా అని చాలామంది చైనా కంపెనీ కెమెరాలను కొనుగోలు చేసేవారు. కానీ, ఇకపై ఆ పప్పులు ఉడకవు. ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. కావునా.. హిక్ విజన్, దహువా, టీపీ లింక్ లాంటి పేరున్న చైనా బ్రాండ్ల అమ్మకాలపై ప్రభుత్వం గట్టిగానే ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో టాప్-5 మేక్ ఇన్ ఇండియా సీసీటీవీ కెమెరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎందుకీ కొత్త రూల్స్?

సీసీటీవీ కెమెరాల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ప్రధాన కారణం మన భద్రత. ఇంటర్నెట్‌తో పని చేసే ఈ కెమెరాల ద్వారా మన వ్యక్తిగత సమాచారం గానీ డేటా గానీ వేరే దేశాలకు చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే STQC అనే కొత్త సర్టిఫికేషన్ నిబంధనను తెచ్చింది. కెమెరాలే కాదు, వాటి లోపల వాడే చిప్స్ కూడా చైనావి అయితే వీటికి పర్మిషన్ దొరకదు. డేటా చోరీకి అడ్డుకట్ట వేయడమే ఈ కొత్త రూల్స్ అసలు ఉద్దేశం.

Advertisement

Also Read: వాల్‌కి స్టిక్ చేస్తే చాలు.. కిచెన్‌లో హాయిగా వంట చేసుకోవచ్చు, ఈ ‘ఏసీ ఫ్యాన్’ ధర ఎంతంటే?

స్వదేశీ బ్రాండ్లదే ఇక హవా..

చైనా కంపెనీలకు ఆంక్షలు విధించడం మన భారతీయ కంపెనీలకు ఒక రకంగా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. మన దగ్గరి కంపెనీలు చైనా విడిభాగాలపై ఆధారపడటం తగ్గించి, సొంతంగా మేక్ ఇన్ ఇండియా పద్ధతిలో కెమెరాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. రాబోయే ఏడాది కాలంలో మార్కెట్‌లో దాదాపు 80 శాతం వాటా మన దేశీ కంపెనీలదే ఉండబోతోందట. దీనివల్ల మనకు నాణ్యమైన, నమ్మకమైన కెమెరాలు అందుబాటులోకి వస్తాయి.

ఏ బ్రాండ్ కెమెరాలు కొంటే బెటర్?

Advertisement

మీరు కొత్తగా సీసీటీవీలు పెట్టించుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. మార్కెట్లో మనకు మంచి ఆప్షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మంచి నెట్‌వర్క్, సర్వీస్ సెంటర్లు ఉన్న ‘సీపీ ప్లస్’ ఇప్పుడు టాప్‌లో ఉంది. ఆఫీసులు, పెద్ద పెద్ద బిల్డింగులకైతే ‘మ్యాట్రిక్స్ కామ్‌సెక్’ బెస్ట్ అనిపించుకుంటోంది. ఇక ఇంట్లో సింపుల్‌గా వాడుకోవడానికి ‘క్యూబో’ కెమెరాలు బాగుంటాయి. వీటితో పాటు ప్రామా, స్పర్ష్ లాంటి కంపెనీలు కూడా మన దేశంలోనే తయారవుతూ మెరుగైన పనితీరును అందిస్తున్నాయి.

కొనేటప్పుడు ఇవి చెక్ చేయండి..

తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని ఏదో ఒక కెమెరా కొనేసి ఆ తర్వాత ఇబ్బంది పడకండి. కెమెరా బాక్సు మీద STQC సర్టిఫికేషన్ గానీ, BIS రిజిస్ట్రేషన్ నెంబర్ గానీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గుర్తింపు పొందిన కెమెరాలు కొంటే మన ప్రైవసీకి డోకా ఉండదు. అంతేకాకుండా.. రేపు ఏదైనా రిపేర్ వచ్చినా సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉండే బ్రాండ్లను ఎంచుకోవడమే తెలివైన పని.

Also Read: భారీగా తగ్గిన ‘Samsung Galaxy Z Fold 7’ ధర.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వాడితే ఇంకా తక్కువకే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×