E-Paper
Advertisement

800W పవర్, డాల్బీ ఆడియో.. తక్కువ ధరలో iBall తెచ్చిన సరికొత్త Cinebar 560!

800W పవర్, డాల్బీ ఆడియో.. తక్కువ ధరలో iBall తెచ్చిన సరికొత్త Cinebar 560!
Advertisement

iBall Cinebar 560: తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న మంచి హోమ్ థియేటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. భారతీయ మార్కెట్లోకి ఐబాల్ కంపెనీ ‘సినీబార్ 560’ పేరుతో ఒక సరికొత్త 5.1 హోమ్ థియేటర్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. సినిమా హాల్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను కేవలం రూ.19,999 ప్రారంభ ధరకే అందిస్తూ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

థియేటర్ లాంటి సౌండ్:

ఇంట్లోనే కూర్చుని సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు చూసేవారికి ఇది అద్భుతమైన ఎంపిక. దీనిలో 800 వాట్స్ పవర్ అవుట్‌పుట్ ఉండటం వల్ల బేస్, సౌండ్ క్వాలిటీ చాలా స్పష్టంగా వస్తాయి. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో వచ్చే ఈ సిస్టమ్ నిజమైన సరౌండ్ సౌండ్ ఫీలింగ్‌ను ఇస్తుంది.

వైర్‌లెస్ స్పీకర్ల సౌలభ్యం:

Advertisement

చాలా సౌండ్‌బార్లు కేవలం సాఫ్ట్‌వేర్ ద్వారా డూప్లికేట్ సరౌండ్ సౌండ్ ఇస్తాయి. కానీ ఐబాల్ సినీబార్ 560లో ప్రత్యేకంగా ఒక సౌండ్‌బార్, ఒక వైర్‌లెస్ సబ్‌వూఫర్, రెండు వైర్‌లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు ఇచ్చారు. ఇవి వైర్‌లెస్ కావడం వల్ల గదిలో వైర్ల గందరగోళం అస్సలు ఉండదు.

Also Read: వస్తువులు మిస్సైనా చిటికెలో కనిపెట్టేయొచ్చు.. జియో తెచ్చిన బడ్జెట్ ట్రాకర్ల కథ ఇదీ!

కనెక్టివిటీ ఆప్షన్లు:

Advertisement

ఈ హోమ్ థియేటర్‌లో బ్లూటూత్ 5.3, హెచ్‌డిఎమ్‌ఐ ఆర్క్ (HDMI ARC), ఆప్టికల్, యూఎస్‌బీ, ఆక్స్ వంటి అన్ని రకాల ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల స్మార్ట్ టీవీలు, గేమింగ్ కన్సోల్‌లు, మొబైల్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు.

ధర వివరాలు:

ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. ఐబాల్ దీని ధరను సామాన్యులకు అందుబాటులో ఉంచింది. తక్కువ బడ్జెట్‌లో ఇల్లే ఒక సినిమా హాల్‌లా మారాలి అనుకునేవారికి, వైర్ల గోల లేకుండా సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి సినీబార్ 560 ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: సౌండ్‌బార్లపై ఉండే 2.1, 3.1, 5.1.2 నెంబర్ల అర్థం తెలుసా? ఇది తెలియకుండా కొంటే నష్టమే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×