E-Paper
Advertisement

మ్యాన్ vs మిషన్.. 10 గంటల ఉత్కంఠ పోరులో.. రోబోపై గెలిచిన మానవ మేధస్సు!

మ్యాన్ vs మిషన్.. 10 గంటల ఉత్కంఠ పోరులో.. రోబోపై గెలిచిన మానవ మేధస్సు!
Advertisement

Human vs Machine: సాంకేతిక ప్రపంచంలో రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయనే చర్చ జోరందుకున్న తరుణంలో ఒక ఆసక్తికరమైన పోటీ జరిగింది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఫిగర్ ఏఐ’ (Figure AI) లైవ్ స్ట్రీమ్ వేదికగా ‘మ్యాన్ వర్సెస్ మిషన్’ (మానవులు vs యంత్రాలు) పేరిట ఒక అద్భుతమైన పోటీని నిర్వహించింది. 10 గంటల పాటు నాన్‌స్టాప్‌గా సాగిన ఈ ప్యాకేజీ సార్టింగ్ పోటీలో చివరికి మానవ మేధస్సే పైచేయి సాధించింది.

10 గంటల మహా సంగ్రామం

రోబోల సామర్థ్యాన్ని, వేగాన్ని పరీక్షించేందుకు ఫిగర్ ఏఐ సంస్థ తమ అత్యాధునిక హ్యుమనాయిడ్ రోబో ‘F.03’ ను రంగంలోకి దించింది. దీనికి పోటీగా ‘ఐమే’ (Aime) అనే కాలేజీ విద్యార్థిని బరిలోకి దింపారు. ఒక పక్క అలసట లేని యంత్రం, మరోపక్క ఉత్సాహంతో కూడిన మానవ శ్రమ మధ్య ఈ పోటీ ఏకధాటిగా 10 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం (Live stream) చేశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ ఉత్కంఠభరిత పోరును వీక్షించారు.

Advertisement

స్వల్ప సెకన్ల తేడాతో..

పోటీ ప్రారంభం నుండి మానవుడు, మిషన్.. హోరాహోరీగా తలపడ్డాయి. ప్యాకేజీలను గుర్తించి వాటిని సరైన స్థానాల్లో సర్దడంలో రోబో, మానవ మేధస్సు రెండూ అద్భుతమైన వేగాన్ని ప్రదర్శించాయి. ఒక్కో ప్యాకేజీని పూర్తి చేయడానికి పట్టిన సమయాన్ని గమనిస్తే పోటీ ఎంత తీవ్రంగా సాగిందో అర్థమవుతుంది. F.03 రోబో వేగం ఒక ప్యాకేజీకి సగటున 2.83 సెకన్లు కాగా.. ఐమే వేగం ఒక ప్యాకేజీకి సగటున 2.79 సెకన్లుగా నమోదైంది. కేవలం 0.04 సెకన్ల స్వల్ప తేడాతో ఐమే రోబో కంటే వేగంగా అత్యధిక ప్యాకేజీలు సర్ది.. అందరినీ ఆశ్చర్యపరిచాడు.

192 ప్యాకేజీల వ్యత్యాసం

Advertisement

10 గంటల సుదీర్ఘ సమయం ముగిసేసరికి, కాలేజీ ఇంటర్న్ ఐమే రోబో కంటే 192 ప్యాకేజీలను ఎక్కువగా సర్ది ఘన విజయం సాధించాడు. రోబోలకు అలసట లేనప్పటికీ మనుషుల్లో ఉండే సమయస్ఫూర్తి, చేతుల కదలికల్లోని ఫ్లెక్సిబిలిటీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే రోబోతో పోలిస్తే మనిషిని విజేతగా నిలిపిందని ప్రశంసిస్తున్నారు.

Also Read: సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. ‘అమ్మ క్యాంటీన్ల’పై కీలక ఆదేశాలు జారీ

ప్రపంచవేదికపై ఆసక్తికర చర్చ

రోబోపై మనిషి సాధించిన విజయం.. సాంకేతిక ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. కొన్ని రంగాలలో మానవ నైపుణ్యాన్ని, వేగాన్ని అందుకోవడానికి యంత్రాలకు ఇంకా సమయం పడుతుందని ఈ పోటీ నిరూపించింది. రోబో వేగానికి సమవుజ్జీగా నిలబడటమే కాకుండా.. దానిపై విజయం సాధించిన ఐమేపై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మానవుల పరువు నిలబెట్టావంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఏనుగుల మధ్య ఘర్షణ.. కాళ్ల కింద నలిగి చనిపోయిన మహిళ.. వీడియో ఇదే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×