E-Paper
Advertisement

10x జూమ్, పిచ్చెక్కించే క్లారిటీ.. Huawei Mate 90 Pro Max కెమెరా సెటప్ చూస్తే ఫ్యూజులు ఎగురుతాయ్!

10x జూమ్, పిచ్చెక్కించే క్లారిటీ.. Huawei Mate 90 Pro Max కెమెరా సెటప్ చూస్తే ఫ్యూజులు ఎగురుతాయ్!
Advertisement

Huawei Mate 90 Pro Max: ప్రముఖ హువావే మొబైల్స్‌కు టెక్ ప్రియుల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకయితే ఈ బ్రాండ్ ఫోన్లలోని కెమెరాలు తెగ నచ్చుతాయి. ఈ నేపథ్యంలో Mate సిరీస్ ఫోన్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మొన్నటికి మొన్న వచ్చిన Mate 80 ఫోన్లు మార్కెట్‌ను ఒక ఊపు ఊపేశాయి. అవి ఇచ్చిన షాక్ నుండి ఇంకా కోలుకోకముందే.. ఇప్పుడు అందరి కళ్లు తదుపరి వెర్షన్ Mate 90 మీద పడ్డాయి. చైనాలో ఈ ఏడాది అక్టోబర్ లోపు ఇవి మార్కెట్లోకి వచ్చేస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

10x ఆప్టికల్ జూమ్‌..

Mate 90 Pro Maxలో అందరినీ ఊరిస్తున్న ప్రధాన ఫీచర్ దాని డ్యూయల్ టెలిఫోటో కెమెరా. నిజానికి పాత మోడల్‌లో కూడా రెండు జూమ్ లెన్స్‌లు ఉన్నాయి. కానీ ఈసారి హువావే డోస్ పెంచింది. దీనిలో ఒక కెమెరా ఏకంగా 10x ఆప్టికల్ జూమ్‌తో రాబోతోందట. దీంతో ఎంత దూరం నుంచి అయినా ఫొటోలు తీసుకోవచ్చు. ఆ పిక్చర్స్ కూడా అస్సలు బ్లర్ అవ్వకుండా కళ్ల ముందు ఉన్నట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడే వాళ్లకి ఈ ఫోన్లు వరమనే చెప్పాలి.

Advertisement

Also Read: 9020mAh బ్యాటరీ.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, iQOO Z11 గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్!

చీకటిలోనూ ఫుల్ క్లారిటీ..

ఫొటోలు ఎంత బాగా వస్తాయనేది అందులో ఉండే సెన్సార్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే హువావే ఈసారి ఒక అంగుళం సైజు ఉండే భారీ సెన్సార్‌ను వాడాలని ప్లాన్ చేస్తోంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సెన్సార్లు ప్రొఫెషనల్ కెమెరాల్లో ఉంటాయి. వీటివల్ల లాభం ఏంటంటే.. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు లేదా నైట్ టైమ్‌లో కూడా ఫొటోలు అద్భుతంగా వస్తాయి. గ్రెయిన్స్ రాకుండా, రంగులు చెదిరిపోకుండా సహజంగా క్యాప్చర్ చేయొచ్చు.

స్క్రీన్ విషయంలో రూటు మార్చి..

Advertisement

లుక్ విషయంలో కూడా ఈసారి పెద్ద మార్పు కనిపించబోతోంది. చాలా కాలంగా వస్తున్న కర్వ్డ్ డిస్‌ప్లేలకు స్వస్తి చెప్పి.. Mate 90 Pro Maxలో ఫ్లాట్ స్క్రీన్‌ను తీసుకొస్తున్నారట. చూడటానికి కర్వ్డ్ స్క్రీన్‌లు స్టైలిష్‌గా ఉన్నా, వాడేటప్పుడు చేతిలో నుండి జారిపోతాయేమో అన్న భయం ఉంటుంది. అందుకే చాలామంది యూజర్లు ఫ్లాట్ స్క్రీన్‌నే కోరుకుంటున్నారు. దీనివల్ల ఫోన్ గ్రిప్ బాగుండటమే కాదు.. పొరపాటున కిందపడినా స్క్రీన్ పగిలే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.

అంచనాలను తలకిందులు చేస్తూ..

ఈ Mate 90 సిరీస్ పర్ఫార్మెన్స్ గురించి టెక్ నిపుణులు చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం వేస్తోంది. కెమెరా సెన్సార్లతో పాటు సాఫ్ట్‌వేర్, AI టెక్నాలజీని కూడా హువావే విపరీతంగా అప్‌గ్రేడ్ చేసిందట. దీనికి తోడు హువావే సొంతంగా తయారు చేసిన చిప్‌సెట్ పవర్ కూడా తోడవటంతో, ఫొటోలు తీసుకోవడం కొత్త అనుభవంలా మారుతుందట. మొత్తానికి స్మార్ట్‌ఫోన్ కెమెరా అంటే ఇలా ఉండాలి అని కొత్త డెఫినిషన్ ఇవ్వడానికి మేట్ 90 సిద్ధమైపోతోంది.

Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. రూ.25వేల లోపు ఇంత మంచి టాబ్లెట్లా? ఈ లేటెస్ట్ లిస్ట్ చూస్తేనే మతిపోతుందిగా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×