E-Paper
Advertisement

99% మందికి తెలియని ఏసీ సీక్రెట్.. ఆ ఒక్క చిన్న మార్పుతో.. గదిలోని విష గాలి మాయం!

99% మందికి తెలియని ఏసీ సీక్రెట్.. ఆ ఒక్క చిన్న మార్పుతో.. గదిలోని విష గాలి మాయం!
Advertisement

Air Conditioner: సాధారణంగా ఎండలు ముదిరినప్పుడే చాలా మంది ఏసీలను ఆన్ చేస్తుంటారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొంది.. గది చల్లగా మారితే చాలని భావిస్తుంటారు.
అయితే చాలా మందికి తెలియని సీక్రెట్ ఒకటి ఏసీలో దాగుంది. ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రతను తగ్గించటమే కాకుండా.. అది ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా కూడా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటించడం ద్వారా గదిలోని గాలిని ఏసీ సాయంతో స్వచ్ఛంగా మార్చుకోవచ్చని పేర్కొంటున్నారు. అది ఎలాగో ఈ కథనంలో చూద్దాం.

గదిలో స్వచ్ఛమైన గాలి

ప్రతీ ఎయిర్ కండిషనర్‌లోనూ అంతర్గతంగా కొన్ని ఫిల్టర్లు ఉంటాయి. ఏసీ రన్ అవుతున్నప్పుడు అవి గదిలోని గాలిని లాక్కుని.. చల్లబరిచి మళ్లీ బయటకు వదులుతుంది. ఈ ప్రక్రియలో గాలిలోని దుమ్ము, ధూళి కణాలు, చిన్న చిన్న పీచు పదార్థాలు ఆ ఫిల్టర్లలో చిక్కుకుపోతాయి. దీనివల్ల గదిలోని గాలి కొంతవరకు శుభ్రపడుతుంది. అయితే ఈ ఫిల్టర్లు ఎంతవరకు గాలిని శుద్ధి చేస్తాయనేది మనం వాటిని ఎంత శుభ్రంగా ఉంచుతామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

ఫిల్టర్ల క్లీనింగ్..

Advertisement

ఏసీ ద్వారా స్వచ్ఛమైన గాలిని పొందాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఫిల్టర్లను క్రమం తప్పకుండా క్లీన్ చేయడం. కనీసం రెండు వారాలకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను తీసి నీటితో కడిగి, ఆరబెట్టి మళ్లీ అమర్చాలి. ఇలా చేయడం వల్ల ఫిల్టర్లపై పేరుకుపోయిన దుమ్ము వదిలిపోతుంది. ఫలితంగా ఏసీ గాలిని సమర్థవంతంగా లాక్కుంటుంది. అలాగే గదిలోకి వచ్చే గాలి కూడా ఎలాంటి అలర్జీ కారకాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది.

PM 2.5 ఫిల్టర్లు

మీ ఇంట్లో సాధారణ ఏసీ ఉన్నప్పటికీ, గాలిని మరింత ఎక్కువగా ప్యూరిఫై చేయాలనుకుంటే మార్కెట్లో దొరికే ‘PM 2.5 ఫిల్టర్లను’ కొనుగోలు చేయవచ్చు. ఇవి ప్రత్యేకమైన పట్టీల రూపంలో ఉంటాయి. వీటిని మీ ఏసీలోని సాధారణ ఫిల్టర్లకు అదనంగా ఫిక్స్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గాలిలో ఉండే కంటికి కనిపించని అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలను, పొగను, బ్యాక్టీరియాను కూడా అడ్డుకుంటాయని పేర్కొంటున్నారు. దీనివల్ల ఏసీ దాదాపు ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ పనిచేస్తుందని వివరిస్తున్నారు.

Advertisement

Also Read: తమిళనాడు కేబినేట్ ఫిక్స్.. సీఎం విజయ్ సహా.. ఎవరికి ఏ బాధ్యతలు దక్కాయంటే?

‘డ్రై మోడ్’ ఆన్ చేస్తే..

వర్షాకాలంలో లేదా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గదిలో ఒక రకమైన ఉక్కపోత, చెమట పడుతుంటుంది. ఇలాంటి సమయంలో గాలిలో బ్యాక్టీరియా, బూజు పెరిగే అవకాశం ఎక్కువ. అలాంటి సందర్భాల్లో ఏసీ రిమోట్‌లో ఉండే ‘డ్రై మోడ్’ ఆప్షన్‌ను ఆన్ చేయడం ద్వారా గదిలోని అదనపు తేమను తగ్గించుకోవచ్చు. తేమ తగ్గడం వల్ల గాలిలో సూక్ష్మజీవులు పెరగవు. గది వాతావరణాన్ని పరిశుభ్రంగా మార్చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Best Smartphones: రూ. 40,000 బడ్జెట్ ఉందా? అయితే ఈ 3 పవర్‌ఫుల్ ఫోన్లపై ఓ లుక్కేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×