E-Paper
Advertisement

Smart Phone Remote: మీ ఫోన్‌నే రిమోట్‌ కంట్రోల్‌గా మార్చుకోండిలా.. ఈ యాప్ ఉంటే చాలు!

Smart Phone Remote: మీ ఫోన్‌నే రిమోట్‌ కంట్రోల్‌గా మార్చుకోండిలా.. ఈ యాప్ ఉంటే చాలు!
Advertisement

Smart Phone Remote: స్మార్ట్ టీవీల్లో రోజుకో కొత్త ఫీచర్ వస్తున్నా.. ఎప్పటి నుంచో ఉన్న సమస్య రిమోట్. ముఖ్యంగా టీవీ రిమోట్ కింద పడిపోవడం వల్ల పనిచేయకపోవడం, స్లో అవ్వడం వంటి సమస్యలు వస్తుంటాయి. పిల్లలున్న ఇంట్లో అయితే నెలకొక రిమోట్ కొనాల్సి ఉంటుంది. ఈ సమస్య పరిష్కారంగా కొన్ని యాప్ లు స్మార్ట్ టీవీల రిమోట్ గా పనిచేస్తు్న్నాయి. అంటే మీ స్మార్ట్ ఫోన్ ను టీవీ రిమోట్ గా మార్చుకోవచ్చు.

టీవీ రిమోట్ పోయినప్పుడల్లా.. ఇకపై కొత్త రిమోట్ కొనాల్సిన అవసరం లేకుండా ఓ ఫ్రీ యాప్‌ టీవీ రిమోట్ సేవలను అందిస్తుంది. ఇటీవల గూగుల్ టీవీ యాప్ స్మార్ట్ టీవీ రిమోట్‌కు ప్రత్యామ్నాయంగా ఉండేది. ప్రామాణికంగా స్మార్ట్ టీవీ రిమోట్‌లు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి యాప్‌ల కోసం యాక్సెస్ బటన్‌లను అందిస్తున్నాయి. గూగుల్ టీవీ స్ట్రీమర్ రిమోట్‌లో ఉన్నట్లుగా బటన్‌లు చూపిస్తుంది.

గూగుల్ టీవీ యాప్

Advertisement

గూగుల్ టీవీ యాప్ మీ ఫోన్ నుంచి నేరుగా మీ టీవీని యాక్సెస్ చేయవచ్చు. ఇది Wi-Fi ఆధారంగా పనిచేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ టీవీ కనెక్ట్ చేసి పూర్తి స్థాయి రిమోట్‌గా వాడుకోవచ్చు. మీ ఫోన్ కీబోర్డుతో నావిగేట్ చేయవచ్చు. అయితే, ఈ సెటప్‌ పనిచేయాలంటే.. మీ ఫోన్, టీవీ ఒకే వై-ఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉండాలి. మీ ఇంట్లో వై-ఫై లేకపోయినా, స్మార్ట్ ఫోన్ ను రిమోట్ లాగా ఉపయోగించడానికి మరో యాప్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ ఉపయోగించే ఈ యాప్‌ను ఉపయోగించవచ్చ.

బీటీ రిమోట్ యాప్

‘బీటీ రిమోట్ యాప్’ ద్వారా స్మార్ట్ టీవీలను సులభంగా కనెక్ట్ చేయవచ్చు. ఇది సంప్రదాయ రిమోట్ మాదిరిగానే పనిచేస్తుంది. ఇది బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్ టీవీకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఆపై యాప్ లో రిమోట్ ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. యాప్ లాగిన్ అయిన తర్వాత, తగిన పర్మిషన్లు ఇస్తే మీ స్మార్ట్ టీవీని ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీని లింక్ చేయడానికి బ్లూటూత్ ఆప్షన్ ను కనెక్ట్ చేయండి. దీంతో నేరుగా మీ రిమోట్ స్క్రీన్‌కు కనెక్ట్ అవుతుంది. ఫిజికల్ రిమోట్ లాగానే, మీ ఫోన్‌లో డిజిటల్ రిమోట్ ఇంటర్‌ఫేస్‌ను కనిపిస్తుంది.

Advertisement

Also Read: కంటెంట్ మీది.. లాభాలు వారివా? గ్లోబల్ టెక్ కంపెనీలకు అశ్వినీ వైష్ణవ్ స్ట్రాంగ్ వార్నింగ్

డిఫాల్ట్‌గా, యాప్ నంబర్ ప్యాడ్ బటన్లు, ప్లేబ్యాక్ కంట్రోల్, నావిగేషన్ డీ-ప్యాడ్, హోమ్, బ్యాక్, వాల్యూమ్ కంట్రోల్ వంటి ఇతర బటన్‌లను చూపిస్తుంది. మీరు క్లీనర్ లేఅవుట్‌ను ఇష్టపడితే, యాప్ సెట్టింగ్‌లలోకి వెళ్లి ఇంటర్‌ఫేస్‌ను మార్చుకోవచ్చు. థీమ్‌లను మార్చడం లేదా నావిగేషన్ మోడ్‌ను డీ-ప్యాడ్ నుండి స్వైప్ కంట్రోల్ కు మార్చుకోవచ్చు. ఇందులో టీవీ స్క్రీన్‌పై కనిపించే మౌస్ మోడ్ కూడా ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×