E-Paper
Advertisement

ఫొటోల్లో వద్దనుకున్నవి సింగిల్ క్లిక్‌తో మాయం.. Google AI Tools ఉచితంగా వాడుకోండిలా!

ఫొటోల్లో వద్దనుకున్నవి సింగిల్ క్లిక్‌తో మాయం.. Google AI Tools ఉచితంగా వాడుకోండిలా!
Advertisement

Photos AI Editing Tools: గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఉండే అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. గతంలో కేవలం పిక్సెల్ ఫోన్లు ఉన్నవారికి లేదా గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే పరిమితమైన ఈ టూల్స్‌ను, ఇప్పుడు గూగుల్ సంస్థ సాధారణ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ ఉచితంగా అందిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

మ్యాజిక్ ఎడిటర్ అద్భుతాలు:

గూగుల్ ఫొటోస్ యాప్‌లో లభించే ‘మ్యాజిక్ ఎడిటర్’ సహాయంతో ఫొటోలను పూర్తిగా మార్చేయవచ్చు. ఫొటోలో వద్దనుకున్న వస్తువులను లేదా వ్యక్తులను కేవలం ఒక్క క్లిక్‌తో తీసేయవచ్చు. ఒకవేళ ఫొటోలో ఒక వ్యక్తి పక్కకు ఉంటే.. వారిని మధ్యలోకి జరపడం లేదా వస్తువుల సైజును పెంచడం, తగ్గించడం వంటివి చాలా సులువుగా చేయవచ్చు. ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లోని స్కై కలర్‌ను మార్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: అమెజాన్ సేల్ మిస్ అయ్యారా? డోంట్ వర్రీ.. ఇంకా తక్కువ ధరకే దొరుకుతున్న బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇవే!

అన్‌బ్లర్, లైట్ అడ్జస్ట్‌మెంట్స్:

కొన్నిసార్లు మనం ఎంతో ఇష్టంగా తీసిన ఫొటోలు కాస్త మసకగా (బ్లర్) వస్తుంటాయి. ఇలాంటి వాటిని సరిచేయడానికి ‘ఫోటో అన్‌బ్లర్’ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. పాత ఫొటోలను కూడా ఇది స్పష్టంగా మారుస్తుంది. అలాగే, ముఖంపై నీడలు పడినప్పుడు లేదా వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ‘పోర్ట్రెయిట్ లైట్’ ఫీచర్‌ను ఉపయోగించి ముఖంపై లైటింగ్ సరిచేసుకోవచ్చు. దీనివల్ల ఫొటోలు స్టూడియోలో తీసినట్లుగా కనిపిస్తాయి.

ఉచితంగా ఎలా వాడాలి?

Advertisement

ఈ AI ఫీచర్లను ఉపయోగించడం చాలా సులభం. దీని కోసం మొదట మొబైల్‌లో గూగుల్ ఫొటోస్ యాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కి అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత మనకు నచ్చిన ఫొటోను సెలెక్ట్ చేసుకుని, కింద ఉండే ‘ఎడిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మ్యాజిక్ ఎడిటర్, అన్‌బ్లర్ వంటి టూల్స్ కనిపిస్తాయి. అయితే, మ్యాజిక్ ఎడిటర్ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోలను నెలకు 10 సార్లు మాత్రమే ఉచితంగా సేవ్ చేసుకునే వీలుంటుంది. అంతకంటే ఎక్కువ కావాలంటే గూగుల్ వన్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సాధారణ AI టూల్స్ మాత్రం ఉచితంగానే వాడుకోవచ్చు.

ఏయే ఫోన్లలో ఫ్రీ అంటే?

ఈ ఫీచర్లు మీ ఫోన్‌లో పనిచేయాలంటే కొన్ని కనీస అర్హతలు ఉండాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 లేదా ఆపై వెర్షన్‌తో, ఐఫోన్ అయితే ఐఓఎస్ 15 లేదా ఆపై వెర్షన్‌తో పనిచేస్తూ ఉండాలి. అలాగే ఫోన్‌లో కనీసం 3GB RAM ఉండటం తప్పనిసరి. ఈ అర్హతలు ఉంటే చాలు.. సాధారణ ఫోన్‌ను కూడా ప్రొఫెషనల్ ఎడిటింగ్ స్టూడియోలా మార్చేసి.. మన ఫొటోలకు సరికొత్త లుక్‌ను ఇవ్వవచ్చు.

Also Read: కొత్త Smart TV కొంటున్నారా? షాప్‌కు వెళ్లేముందు ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×