E-Paper
Advertisement

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!
Advertisement

AC Dry Mode: సాధారణంగా వర్షాకాలం మొదలైందంటే.. ఉక్కపోత, జిడ్డుగా అనిపించే తేమతో ఇంట్లో ఉండటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. వాతావరణం మరీ వేడిగా లేకపోయినా.. గాలిలో ఉండే తేమ వల్ల గది మొత్తం ఒక రకమైన వాసన కూడా వస్తుంటుంది. ఇలాంటి సమయంలో ఏసీలోని ‘డ్రై మోడ్’ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

డ్రై మోడ్ అంటే?

మనలో చాలామంది ఏసీ అనగానే గదిని చల్లబరచడమే అనుకుంటాం. కానీ డ్రై మోడ్ ప్రధాన పని గదిలోని తేమని పెట్టే అదనపు తేమను బయటకు పంపడం. దీనివల్ల గది ఉష్ణోగ్రత మరీ తగ్గిపోకుండా.. వాతావరణం చాలా ప్రశాంతంగా, హాయిగా మారుతుంది.

ఆన్ చేయడం ఎలా?

Advertisement

ఏసీ రిమోట్‌లో Water Droplet Icon లేదా Dry అని రాసి ఉంటుంది. Mode బటన్ నొక్కి ఈ మోడ్‌ని ఎంచుకోవచ్చు. డ్రై మోడ్ ఆన్ చేశాక టెంపరేచర్‌ని 24 నుండి 26 డిగ్రీల మధ్య సెట్ చేసుకోవడం మంచిది. ఏసీ వేసేముందు తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి ఉంచితే బయటి తేమ గదిలోకి రాకుండా ఉంటుంది.

Also Read: బట్టలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. వేడి నీళ్లతో ఉతకాలా? చల్లటి నీళ్లతోనా?

ఎంతసేపు వాడాలి?

Advertisement

గదిలో ఉక్కపోత, తేమగా అనిపించినప్పుడు 1 నుండి 3 గంటల పాటు డ్రై మోడ్ వాడితే సరిపోతుంది. ఆ తర్వాత గది సాధారణ స్థితికి వస్తుంది. ఒకవేళ బయట బాగా వేడిగా ఉంటే మాత్రం మళ్లీ కూల్ మోడ్‌కి మార్చడం ఉత్తమం. డ్రై మోడ్‌ని రోజంతా continuousగా వాడితే గాలి బాగా పొడిగా మారి చర్మం, కళ్లు పొడిబారే అవకాశం ఉంటుంది.

కరెంట్ బిల్లు ఎలా తగ్గుతుంది?

కూల్ మోడ్‌తో పోలిస్తే.. డ్రై మోడ్‌లో కంప్రెసర్, ఫ్యాన్ భిన్నంగా పనిచేస్తాయి. ఇది ఉష్ణోగ్రతను తగ్గించడం కంటే తేమను తీసేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో కంప్రెసర్‌పై భారం తగ్గి కరెంట్ వినియోగం తగ్గుతుంది. అయితే ఇది గది సైజు, ఏసీ మోడల్‌పై కూడా ఆధారపడి ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

డ్రై మోడ్ బాగా పనిచేయాలంటే ఏసీ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్లపై దుమ్ము ఉంటే గాలి సరిగ్గా ఆడదు. అలాగే డ్రైనేజీ పైప్ నుండి నీరు సరిగ్గా బయటకు వెళ్తుందో లేదో చూసుకోవాలి. ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో తిప్పితే చల్లని గాలి గదంతా సమానంగా విస్తరిస్తుంది.

Also Read: మీ ఏరియాలో Airtel బ్రాడ్‌బ్యాండ్ ఉందో? లేదో? 2 నిమిషాల్లో చెక్ చేసుకోండిలా..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×