E-Paper
Advertisement

కొత్త ఐఫోన్ తీసుకున్నారా? ఆండ్రాయిడ్ నుంచి వాట్సాప్ చాట్స్ ఇలా మూవ్ చేసుకోండి!

కొత్త ఐఫోన్ తీసుకున్నారా? ఆండ్రాయిడ్ నుంచి వాట్సాప్ చాట్స్ ఇలా మూవ్ చేసుకోండి!
Advertisement

Transfer WhatsApp chats from Android to iPhone: ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి సరికొత్త ఐఫోన్‌కు మారాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ టెన్షన్ అంతా పాత వాట్సాప్ చాట్స్ , మెసేజ్‌లు ఏమవుతాయనేదే ఉంటుంది. ఒకప్పుడు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న తరుణంలో గూగుల్ , ఆపిల్ అధికారిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పాత వాట్సాప్ జ్ఞాపకాలను కొత్త ఐఫోన్‌లోకి సేఫ్ గా ఎలా తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ చాట్స్ మార్చడం ఎలా?

చాలా మంది తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వదిలి స్టైలిష్‌గా ఉండే ఐఫోన్‌ను కొంటారు. కానీ పాత ఫోన్‌లోని ముఖ్యమైన చాట్లు, గ్రూప్ మెసేజ్‌లు, ఫొటోలు పోతాయనే భయంతో వస్తువులను మార్చడానికి వెనకాడతారు. మీ వాట్సాప్ డేటా ఏ ఒక్క చిన్న మెసేజ్ కూడా మిస్ కాకుండా ఐఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఒక అఫీషియల్ , సింపుల్ ప్రాసెస్ ఉంది. అదేంటో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ ..

Advertisement

ముందస్తు ఏర్పాట్లు :
1.ఈ ప్రాసెస్ ప్రారంభించే ముందు మీ దగ్గర ఈ క్రిందివి కచ్చితంగా ఉండాలి.

2.మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే ఎక్కువ వర్షన్ ఉండాలి.

Advertisement

3.ఐఫోన్‌లో iOS 15.5 లేదా ఆపై వర్షన్ రన్ అవుతుండాలి.

4.రెండు ఫోన్లలోనూ ఒకే మొబైల్ నంబర్ వాడాలి.

5.ఐఫోన్ కొత్తది అయి ఉండాలి లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఉండాలి.

6. రెండు ఫోన్లూ ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి, ఛార్జింగ్ పెట్టి ఉండాలి.

‘Move to iOS’ యాప్ ద్వారా చాట్స్ ట్రాన్స్‌ఫర్ చేసే విధానం:

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి అధికారిక ‘Move to iOS’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: కొత్త ఐఫోన్‌ను ఆన్ చేసి సెటప్ చేస్తుండగా స్క్రీన్ మీద వచ్చే ఆప్షన్లలో ‘Move Data from Android’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. అప్పుడు ఐఫోన్ స్క్రీన్ మీద ఒక కోడ్ కనిపిస్తుంది.

స్టెప్ 3: ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘Move to iOS’ యాప్ ఓపెన్ చేసి కంటిన్యూ కొట్టి, ఐఫోన్‌పై కనిపించిన ఆ కోడ్‌ను అందులో ఎంటర్ చేయండి.

స్టెప్ 4: ఆ తర్వాత ‘Transfer Data’ అనే స్క్రీన్ వస్తుంది. అక్కడ ‘WhatsApp’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

స్టెప్ 5: ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘Start’ మీద టాప్ చేయండి. వాట్సాప్ డేటా అంతా ప్రిపేర్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వాట్సాప్ లాగౌట్ అవుతుంది.

స్టెప్ 6: ఇప్పుడు ఐఫోన్‌లో యాప్ స్టోర్ నుంచి తాజా వర్షన్ WhatsApp డౌన్‌లోడ్ చేసుకొని, మీ పాత నంబర్‌తోనే లాగిన్ అవ్వండి.

స్టెప్ 7: స్క్రీన్ మీద వచ్చే ప్రాంప్ట్‌లను ఫాలో అయితే చాలు, మీ ఆండ్రాయిడ్ వాట్సాప్ చాట్స్ అన్నీ మీ కొత్త ఐఫోన్‌లోకి సేఫ్‌గా వచ్చేస్తాయి.

ముఖ్యమైన విషయాలు:
ఈ పద్ధతి ద్వారా మీ పర్సనల్ చాట్లు, గ్రూప్ మెసేజ్‌లు, మీడియా ఫైల్స్ అన్నీ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. కానీ మీ కాల్ హిస్టరీ, పీర్-టు-పీర్ పేమెంట్ మెసేజ్‌లు మాత్రం ట్రాన్స్‌ఫర్ అవ్వవు. ఐఫోన్‌ను ఇప్పటికే సెటప్ చేసి వాట్సాప్ వాడుతుంటే.. చాట్స్ తెచ్చుకోవడానికి మళ్లీ ఐఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారాలని ఆలోచిస్తుంటే.. ఈ సింపుల్ పద్ధతిని ఫాలో అయి మీ వాట్సాప్ డేటాను ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×