E-Paper
Advertisement

యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి.. Android 17 కొత్త ట్రిక్ ఇదే!

యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి.. Android 17 కొత్త ట్రిక్ ఇదే!
Advertisement

Data Transfer: ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి మారాలని చాలామందికి ట్రై చేస్తుంటారు. కానీ, పాత ఫోన్‌లోని ఫొటోలు, కాంటాక్ట్స్, పాస్‌వర్డ్‌లు.. ఇలా సమస్తం కొత్త దాంట్లోకి మార్చుకోవడమే అసలైన సర్కస్ ఫీట్. అందుకే సగం మంది ఆ ఆలోచననే పక్కన పెట్టేస్తుంటారు. అయితే, ఐఫోన్ యూజర్ల ఈ తలనొప్పికి గూగుల్ ఈసారి చెక్ పెట్టింది. అవును మీరు విన్నది నిజమే.. ఒక్క క్లిక్‌తో ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి సెకండ్లలో డేటా షేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏం మార్చబోతున్నారు?

ఆండ్రాయిడ్ 17 వెర్షన్‌లో గూగుల్ ఒక సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇకపై ఐఫోన్ నుంచి డేటాను ఆండ్రాయిడ్‌కు బదిలీ చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త ఫోన్ ఆన్ చేసి సెటప్ చేసుకునే సమయంలోనే, ఐఫోన్ లోని ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, క్యాలెండర్ ఈవెంట్స్, సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, వైఫై సమాచారం, చివరికి ఈ-సిమ్ (eSIM) వివరాలను కూడా చాలా సులువుగా వైర్‌లెస్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఇంత తక్కువ ధరకే అలాంటి ఫీచర్లా? 144Hz OLED డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో Asus Pad T3201!

ఎలా పనిచేస్తుంది?

ఈ డేటా ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది. కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ సెటప్ చేసేటప్పుడు Copy Data From Iphone అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోగానే స్క్రీన్‌పై ఒక QR కోడ్ వస్తుంది. మీ పాత ఐఫోన్‌తో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. రెండు ఫోన్ల మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మీకు కావలసిన డేటాను ఎంచుకుని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యూఆర్ కోడ్ స్కాన్ కాకపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉంటాయి.

వాట్సప్, మెసేజింగ్ సమస్యలకు చెక్:

Advertisement

చాలామంది ఐఫోన్ నుంచి మారడానికి భయపడేది వాట్సప్ చాట్‌లు, మెసేజ్‌ల కోసమే. ఈ కొత్త అప్‌డేట్‌తో వాట్సప్ చాట్‌లను కూడా సులభంగా ఆండ్రాయిడ్‌లోకి మార్చుకోవచ్చు. అలాగే ఐక్లౌడ్‌లోని ఫొటోలను గూగుల్ ఫొటోస్‌కి మార్చుకోవడానికి, ఐమెసేజ్ స్థానంలో గూగుల్ మెసేజెస్ వాడటానికి గూగుల్ స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తోంది.

అందుబాటులోకి వచ్చిందా?

ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 17తో వచ్చే ఎంపిక చేసిన పిక్సెల్ ఫోన్లతో పాటు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్లలోకి కూడా రానుంది. డేటా ట్రాన్స్‌ఫర్‌తో పాటు ఆండ్రాయిడ్ 17లో మెరుగైన సెక్యూరిటీ, డెస్క్‌టాప్ మోడ్, జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి మరిన్ని అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: యూజర్లు నిద్రపోతున్నా బ్యాగ్రౌండ్‌లో వర్క్ కంప్లీట్ చేసే Google Gemini Spark.. భారత్‌లో లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×