E-Paper
Advertisement

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?
Advertisement

Meta AI Privacy: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి మెటా యాప్స్‌ని మనం ప్రతిరోజూ వాడుతుంటాం. అయితే, మన డేటాని మెటా తమ ఏఐ మోడల్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగిస్తుందనే విషయం చాలామందికి తెలియదు. మన వ్యక్తిగత సమాచారం ఏఐ చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవడానికి యాప్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రైవసీ సెంటర్ చూడటం:

మీరు రెగ్యులర్‌గా వాడే ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ కనిపించే Privacy Center ఓపెన్ చేస్తే.. మెటా మీ వివరాలను ఎలా వాడుతుందో ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.

ఏఐ ఆప్షన్లను సరిచూసుకోవడం:

Advertisement

ప్రైవసీ సెంటర్‌లో ఏఐ డేటా వినియోగానికి సంబంధించి ఒక విభాగం ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ఆప్షన్లు మారుతుంటాయి. మీ ప్రొఫైల్ సమాచారం, మీరు పెట్టే పోస్టులను ఏఐ కోసం ఎలా వాడుతున్నారనేది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.

Also Read: లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్లు.. రూ.8,999 ప్రారంభ ధరకే Lava Virat V1, V1 5G లాంచ్!

అభ్యంతరం తెలుపడం:

Advertisement

మీ డేటాను ఏఐ ట్రైనింగ్ కోసం వాడకూడదని భావిస్తే.. మెటా ఒక ఆబ్జెక్షన్ (Objection) ఫోరమ్‌ని అందిస్తుంది. అందులో అడిగిన వివరాలను సరిగ్గా పూర్తి చేసి సబ్‌మిట్ చేస్తే, మెటా మీ రిక్వెస్ట్‌ను రివ్యూ చేసి ఏఐ ప్రాసెసింగ్ నుంచి మీ సమాచారాన్ని మినహాయిస్తుంది.

పబ్లిక్ పోస్టులు తగ్గించడం:

మీ ప్రొఫైల్‌లో ఎంత తక్కువ పబ్లిక్ కంటెంట్ ఉంటే.. ఏఐకి అంత తక్కువ డేటా అందుతుంది. కాబట్టి మీ పాత పబ్లిక్ పోస్టులను ప్రైవేట్‌గా మార్చుకోవడం లేదా మీ ఫ్రెండ్స్‌కి మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ మార్చుకోవడం మంచిది.

థర్డ్ పార్టీ యాప్స్ తొలగించడం:

చాలామంది మెటా ఖాతాతో రకరకాల యాప్స్‌లోకి లాగిన్ అవుతుంటారు. మీ ఖాతాకు లింక్ అయి ఉన్న అవసరం లేని థర్డ్ పార్టీ యాప్స్‌ని, వెబ్‌సైట్ల పర్మిషన్లను వెంటనే తీసివేయండి. ఇది మీ డేటా సేఫ్టీకి చాలా అవసరం.

Also Read: 7400mAh బ్యాటరీ, 8000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో iQOO 15 Ultra గ్లోబల్ లాంచ్‌కి రెడీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×