E-Paper
Advertisement

మిక్సీ బ్లేడ్లు మొద్దుబారాయా? కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే పదును పెట్టండిలా!

మిక్సీ బ్లేడ్లు మొద్దుబారాయా? కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే పదును పెట్టండిలా!
Advertisement

How to sharpen mixer grinder blades: ఈ రోజుల్లో కిచెన్‌లో మిక్సర్ గ్రైండర్ లేని ఇల్లే లేదు. మసాలాలు నూరాలన్నా, చట్నీలు చేయాలన్నా మిక్సీ ఉండాల్సిందే. అయితే.. రోజూ వాడటం వల్ల కొన్ని రోజులకే మిక్సీ బ్లేడ్లు మొద్దుబారిపోతుంటాయి. దాంతో గ్రైండింగ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పైగా కరెంట్ కూడా వేస్ట్ అవుతుంది. దీనికోసం మెకానిక్ దగ్గరకు పరిగెత్తాల్సిన పనిలేదు. రూపాయి ఖర్చు లేకుండా.. కేవలం ఐదు నిమిషాల్లో మీ ఇంట్లోనే మిక్సీ బ్లేడ్లను వజ్రంలా మెరిపించేలా.. పదును పెట్టే అద్భుతమైన హోమ్ హాక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మిక్సీ బ్లేడ్లు ఎందుకు మొద్దుబారుతాయి?
మనం మిక్సీలో గట్టి పదార్థాలైన పసుపు కొమ్ములు, ఎండుమిర్చి, లేదా ఐస్ ముక్కలు వంటివి తరచూ వేసి గ్రైండ్ చేయడం వల్ల బ్లేడ్ల అంచులు వాటి పదునును కోల్పోతాయి. బ్లేడ్లు సరిగ్గా పని చేయకపోతే మోటార్‌పై భారం పడి మిక్సీ త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అందుకే నెలకు ఒకసారి కింద పేర్కొన్న చిట్కాలతో బ్లేడ్లను షార్ప్ చేసుకోవడం మంచిది.

Advertisement

1. రాళ్ల ఉప్పు చిట్కా :
మిక్సీ బ్లేడ్లను పదును పెట్టడానికి అత్యంత సులభమైన, పురాతనమైన పద్ధతి రాళ్ల ఉప్పు .

చేయాల్సిన విధానం: ఒక కప్పు రాళ్ల ఉప్పును తీసుకుని మిక్సీ జార్‌లో వేయండి.

Advertisement

జార్ మూత పెట్టి, హై స్పీడ్‌లో ఒక నిమిషం పాటు బ్లెండ్ చేయండి.

ఆ తర్వాత కాసేపు ఆపి, మళ్లీ పల్స్ మోడ్‌లో 3 లేదా 4 సార్లు తిప్పండి.

ఉప్పులోని గరుకుదనం బ్లేడ్ల అంచులను రాపిడికి గురిచేసి, వాటిని తక్షణమే పదునుగా మారుస్తుంది. ఈ ఉప్పును పారేయకుండా వంటల్లో వాడుకోవచ్చు.

2. అల్యూమినియం ఫాయిల్ మ్యాజిక్ :
ప్యాకింగ్‌కు వాడే అల్యూమినియం ఫాయిల్ పేపర్ మిక్సీ బ్లేడ్లను పదును పెట్టడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది.

చేయాల్సిన విధానం: కొద్దిగా అల్యూమినియం ఫాయిల్ తీసుకుని, దాన్ని చిన్న చిన్న బాల్స్ (ఉండలు) లాగా చుట్టండి.

ఈ చిన్న ఫాయిల్ బాల్స్‌ను మిక్సీ జార్‌లో వేసి, ఒక నిమిషం పాటు హై స్పీడ్‌లో గ్రైండ్ చేయండి.

ఫాయిల్ ముక్కల ఘర్షణ వల్ల బ్లేడ్లు చాలా షార్ప్‌గా తయారవుతాయి.

3. గుడ్డు పెంకుల చిట్కా:
చాలా మంది గుడ్డు పెంకులను పారేస్తుంటారు. కానీ వీటితో మిక్సీ బ్లేడ్లను సూపర్ షార్ప్‌గా మార్చవచ్చు.

చేయాల్సిన విధానం: గుడ్డు పెంకులను బాగా కడిగి, ఎండబెట్టండి.

ఈ ఎండిన పెంకులను మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేయండి.

పెంకులు పౌడర్‌లా మారే ప్రక్రియలో బ్లేడ్లు పదును దేరతాయి. ఆ పౌడర్‌ను మొక్కలకు ఎరువుగా కూడా వాడుకోవచ్చు.

జాగ్రత్తలు:
మిక్సీ బ్లేడ్లను పదును పెట్టేటప్పుడు జార్ పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. అలాగే.. బ్లేడ్లను పదును పెట్టిన తర్వాత జార్‌ను లిక్విడ్ సోప్‌తో బాగా కడిగి, ఆరబెట్టాలి. ఈ సింపుల్ కిచెన్ హ్యాక్స్‌ను ఫాలో అయితే మీ మిక్సీ లైఫ్ పెరగడమే కాదు, మీ సమయం, డబ్బు కూడా ఆదా అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈరోజే మీ ఇంట్లోని మిక్సీపై ఈ ట్రిక్స్ ట్రై చేసి చూడండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×