E-Paper
Advertisement

Google Maps Tips: కారు పార్క్ చేసిన చోటు గుర్తుండటం లేదా? గూగుల్ మ్యాప్స్‌లో ఇలా లొకేషన్ సేవ్ చేసుకోండి!

Google Maps Tips: కారు పార్క్ చేసిన చోటు గుర్తుండటం లేదా? గూగుల్ మ్యాప్స్‌లో ఇలా లొకేషన్ సేవ్ చేసుకోండి!
Advertisement

Google Maps Tips: ఏదైనా పని మీద బయటకి వెళ్లినప్పుడు.. పెద్ద పెద్ద సిటీల్లో లేదంటే రద్దీగా ఉండే ప్రాంతాల్లో కారును ఓ పక్కకు పార్క్ చేస్తుంటారు చాలామంది. అయితే పని ముగించుకుని తిరిగి కారు తీసుకుందాం అని వచ్చేసరికి అది ఎక్కడ ఉందో వెతుక్కోవడం పెద్ద తలపోటుగా మారుతుంటుంది. ఈ క్రమంలో అన్ని వీధులు ఒకేలా అనిపించడం, కన్ఫ్యూజన్ అవ్వడం సహజం. ఇలాంటి సమయాల్లో మనం రోజూ వాడే గూగుల్ మ్యాప్స్‌ను కాస్త తెలివిగా వాడితే.. ఇక కారు ఎక్కడుందో వెతుక్కునే బాధ తప్పుతుంది. కేవలం రూట్ చూడటానికే కాకుండా.. మన కారు ఎక్కడ ఉందో ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి దీనిలో ఓ సీక్రెట్ ఫీచర్ ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే..

మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే.. కారు పార్క్ చేసిన వెంటనే గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. మ్యాప్‌లో మీరు ఉన్న చోట కనిపించే నీలిరంగు చుక్కపై క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ‘సేవ్ పార్కింగ్’ అనే బటన్‌ను నొక్కితే చాలు. గూగుల్ మ్యాప్స్ ఆ లొకేషన్‌ను గుర్తుపెట్టుకుంటుంది. తిరిగి కారు దగ్గరకు వెళ్లాలనుకున్నప్పుడు యాప్‌లోని సెర్చ్ బార్‌పై క్లిక్ చేస్తే ‘పార్కింగ్ లొకేషన్’ అని కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకుని ‘డైరెక్షన్స్’ మీద నొక్కితే మ్యాప్ మిమ్మల్ని నేరుగా కారు దగ్గరకు తీసుకెళ్తుంది.

Advertisement

Also Read: యాపిల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ఇక ఐఫోన్ వాడకం పూర్తిగా మారనుంది!

ఐఫోన్ యూజర్ల కోసం:

ఐఫోన్ లేదా ఐప్యాడ్ వాడుతున్న వారికీ దాదాపు ఇలాంటి పద్ధతే ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి బ్లూ డాట్‌పై క్లిక్ చేసినప్పుడు ‘సెట్ యాస్ పార్కింగ్ లొకేషన్’ అని కనిపిస్తుంది. దీనివల్ల మ్యాప్‌పై ఒక పిన్ గుర్తు ఏర్పడుతుంది. యాపిల్ డివైజుల్లో ఈ లొకేషన్ సుమారు 48 గంటల వరకు సేవ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు పార్క్ చేసిన చోటు నుంచి కొంచెం దూరంగా పిన్ పడితే, ‘చేంజ్ లొకేషన్’ ఆప్షన్ ద్వారా దాన్ని సరిచేసుకోవచ్చు. కారు దొరికేసిన తర్వాత ‘క్లియర్’ బటన్ నొక్కి ఆ లొకేషన్‌ తొలగిపోతుంది.

ఇతరుతో పంచుకోవాలంటే?

Advertisement

కొన్నిసార్లు మనం కారు పార్క్ చేసి, మన స్నేహితులను లేదంటే కుటుంబ సభ్యులను అక్కడికి రమ్మని చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఐఫోన్ యూజర్లు సేవ్ చేసుకున్న పార్కింగ్ లొకేషన్‌ను ఇతరులకు షేర్ చేయొచ్చు. మ్యాప్‌లోని పార్కింగ్ పిన్‌పై క్లిక్ చేసి ‘షేర్’ ఆప్షన్ ఎంచుకుంటే.. వాట్సాప్ లేదా ఇతర యాప్స్ ద్వారా ఆ లొకేషన్‌ను పంపొచ్చు. దీంతో అవతలి వారు ఎలాంటి తికమక లేకుండా నేరుగా కారు ఉన్న చోటికి చేరుకోగలుగుతారు.

కారు పార్కింగ్ చోటు కావాలంటే?

గమ్యస్థానానికి చేరుకోకముందే అక్కడ పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందో కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ద్వారా మీ డెస్టినేషన్ సమీపంలోని పార్కింగ్ గ్యారేజీలు, పబ్లిక్ పార్కింగ్ స్థలాలను ముందే చూసుకోవచ్చు. ఇది మీకు అక్కడ పార్కింగ్ దొరుకుతుందని గ్యారెంటీ ఇవ్వకపోయినా, ఒక అవగాహనకు రావడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న టెక్నిక్ పాటిస్తే పార్కింగ్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.

Also Read: రూ.8,000 లోపే అదిరిపోయే స్మార్ట్ టీవీలు.. ఈ ఆఫర్‌ను మిస్ చేసుకుంటే తర్వాత మీరే బాధపడతారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×