E-Paper
Advertisement

Hackers: చిన్న నిర్లక్ష్యం మీ డేటాను హ్యాకర్ల చేతిలో పెట్టొచ్చు.. ఫ్రీ Wi-Fiలో లాగిన్ అయ్యేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!

Hackers: చిన్న నిర్లక్ష్యం మీ డేటాను హ్యాకర్ల చేతిలో పెట్టొచ్చు.. ఫ్రీ Wi-Fiలో లాగిన్ అయ్యేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!
Advertisement

Hackers: ప్రస్తుతం ఎక్కడికివెళ్లినా ఉచిత వైఫై అందుబాటులో ఉంటుంది. కాఫీ షాప్, లైబ్రరీ, ఎయిర్‌పోర్ట్ లేదా హోటల్.. ఇలా అన్నిచోట్లా ఫ్రీ ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేసుకుంటున్నారు చాలామంది. అయితే ఈ సౌకర్యంతో పాటు ఓ ప్రమాదం కూడా దాగి ఉంటుందని గ్రహించాలి. ఫ్రీ WiFi వాడేముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. మీ మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లో పడే అవకాశం ఉంది. అందుకే మీ డేటా భద్రంగా ఉండాలంటే.. కొన్ని కీలకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన ఇంటర్నెట్ సేఫ్టీ చిట్కాలపై ఓ లుక్కేద్దాం రండి.

1) పబ్లిక్ Wi-Fi ఉపయోగిస్తున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ చెక్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం లేదా క్రెడిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయడం చాలా ప్రమాదకరం. ఇలాంటి పనులు ఎప్పుడూ సురక్షితమైన, ప్రైవేట్ నెట్‌వర్క్‌లోనే చేయడం మంచిది.

Advertisement

2) మీ ఫోన్‌లో GPS, బ్లూటూత్, వైర్‌లెస్ కనెక్షన్లు, జియో-ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఎప్పుడూ ఆన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఇవి హ్యాకర్లకు మీ లొకేషన్ లేదా డేటాను ట్రాక్ చేయడానికి అవకాశం ఇస్తాయి. కాబట్టి.. అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఆన్ చేయడం ఉత్తమం.

Also Read: స్మార్ట్‌ఫోన్ ఏ టైమ్‌లో కొనుగోలు చేస్తే డబ్బులు మిగులుతాయి?.. ఈ టిప్‌తో వేలకు వేలు ఆదా!

Advertisement

3) నమ్మదగిన యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేయండి. మంచి రిప్యూటేషన్ ఉన్న యాప్స్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఫోన్ సాఫ్ట్‌వేర్, యాప్స్‌ను తరచూ అప్‌డేట్ చేయాలి. మీరు ఉపయోగించని పాత యాప్స్‌ను తొలగించడం కూడా భద్రతకు ఉపయోగకరమే.

4) అలాగే మీ ఫోన్‌కు తప్పనిసరిగా పాస్‌వర్డ్ లేదా లాక్ కోడ్ పెట్టాలి. పాస్‌వర్డ్ కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలి. అందులో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, నంబర్లు లేదా ప్రత్యేక గుర్తులు ఉండేలా చూసుకోండి. దీంతోపాటు పాస్‌వర్డ్‌ల కోసం ఆటో కంప్లీట్ ఫీచర్ వాడకపోవడమే బెటర్. అలాగే మీ ఫోన్‌లో స్టోరేజ్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసి, స్క్రీన్ టైమ్‌ఔట్ ఐదు నిమిషాల లోపే ఉండేలా సెట్ చేసుకోండి.

5) ఫోన్‌కు తెలియని మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ లేదా సోషల్ మీడియా లింకులు తరచూ వస్తుంటాయి. ఆ మెసేజులు, అటాచ్‌మెంట్లు మీకు తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిందా, లేదా? అనేది ముఖ్యంగా గమనించాల్సివ విషయం. ఒకవేళ ఆ అటాచ్‌మెంట్లు నమ్మదగినవిగా లేకపోతే వాటిని ఓపెన్ చేయకపోవడమే ఉత్తమం.

6) మీ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు కూడా మీ డేటా భద్రంగా ఉండేలా ముందే సెట్టింగ్స్ చేసుకోవాలి. కొన్ని సార్లు పాస్‌వర్డ్ తప్పుగా ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ ఆటోమేటిక్‌గా లాక్ అయ్యేలా లేదా డేటా ఎరేజ్ అయ్యేలా సెటప్ చేసుకోవచ్చు. అవసరమైతే మీ ఫోన్‌ను ట్రేస్ చేసే ఆప్షన్‌ను కూడా ఉపయోగించండి.

7) ఇంటర్నెట్ మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ.. నిర్లక్ష్యం చేస్తే అదే పెద్ద ప్రమాదంగా మారుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, స్మార్ట్ సెట్టింగ్స్‌తో మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ల నుంచి రక్షించుకోవచ్చు. పైన తెలిపిన చిట్కాలను పాటిస్తే.. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Also Read: భారత్‌లో boAt వాలర్ రింగ్ 1 లాంచ్.. 15 రోజుల బ్యాటరీతో ప్రీమియం స్మార్ట్ రింగ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×