E-Paper
Advertisement

SD కార్డ్, క్లౌడ్ పేమెంట్స్ అక్కర్లేదు.. ఈ 5 స్టెప్స్‌ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోండి!

SD కార్డ్, క్లౌడ్ పేమెంట్స్ అక్కర్లేదు.. ఈ 5 స్టెప్స్‌ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోండి!
Advertisement

Android Phone Storage: ఇప్పుడు వస్తున్న కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో కనీసం 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. కొంతమందికి ఇది సరిపోవచ్చు కానీ, మరికొందరికి మాత్రం ఫొటోలు, వీడియోలు, యాప్స్‌తో చాలా వేగంగా నిండిపోతుంది. ఒకప్పుడు స్టోరేజ్ నిండితే వెంటనే ఒక మైక్రో SD కార్డ్ కొని ఫోన్లో వేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు వచ్చే చాలా ఫోన్లలో SD కార్డ్ స్లాట్ ఇవ్వడం మానేశారు. అలాగని ఫోన్ స్టోరేజ్ కోసం ప్రతి నెలా డబ్బులు పెట్టి క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

ఉచిత క్లౌడ్ స్టోరేజ్ వాడండి..

క్లౌడ్ సేవలను పూర్తిగా పక్కన పెట్టలేం. గూగుల్ ప్రతి అకౌంట్‌కి ఉచితంగా 15GB స్టోరేజ్ ఇస్తుంది. ఫొటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లను ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ గూగుల్ స్టోరేజ్ నిండిపోతే.. ఉచితంగా లభించే ఇతర సురక్షితమైన యాప్‌లను ప్రయత్నించవచ్చు.

పెన్‌డ్రైవ్‌లతో ఫైల్స్ మార్చుకోవచ్చు..

Advertisement

ఒక చిన్న USB-C టైప్ ఫ్లాష్ డ్రైవ్ లేదా పెన్‌డ్రైవ్ మీ దగ్గర ఉంటే చాలు. నేరుగా ఫోన్‌కి కనెక్ట్ చేసి, మీ వద్ద ఉన్న పెద్ద పెద్ద ఫైళ్లను, వీడియోలను అందులోకి మార్చుకోవచ్చు. దీనివల్ల ఫోన్లో చాలా స్పేస్ మిగులుతుంది.

Also Read: ఫేస్‌బుక్‌లో పొరపాటున స్టోరీ పోస్ట్ చేశారా? ఇలా క్షణాల్లో డిలీట్ చేసేయండి!

ఎక్స్‌టర్నల్ SSD వాడకం..

Advertisement

మీ వద్ద ఎక్కువ సమాచారం ఉంటే ఎక్స్‌టర్నల్ SSD చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా వేగంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇప్పుడు వస్తున్న కొన్ని అధునాతన ఆండ్రాయిడ్ ఫోన్లలో నేరుగా ఈ SSDలకే HD లేదా 8K వీడియోలను రికార్డ్ చేసే వెసులుబాటు కూడా ఉంది.

OTG ఆప్షన్ ఆన్ చేయడండి..

మీరు ఎక్స్‌టర్నల్ డ్రైవ్ లేదా పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ దానిని వెంటనే గుర్తించకపోతే కంగారు పడక్కర్లేదు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి OTG ఆప్షన్‌ను ఆన్ చేస్తే.. మీ ఫైల్ మేనేజర్‌లో డ్రైవ్ కనిపించడం ప్రారంభిస్తుంది.

పాత SD కార్డులనూ వాడొచ్చు..

మీ దగ్గర పాత కెమెరా SD కార్డ్ లేదా కార్డ్ రీడర్ ఉంటే.. టైప్-సి అడాప్టర్ సహాయంతో దాన్ని ఫోన్‌కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఇలా డబ్బులు వృధా కాకుండా, నచ్చిన రీతిలో ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

Also Read: ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×