E-Paper
Advertisement

లక్ష రూపాయల iPhone 16 Pro.. ఇప్పుడు రూ.50,000కే వచ్చేస్తోంది, ఎలాగో తెలుసా?

లక్ష రూపాయల iPhone 16 Pro.. ఇప్పుడు రూ.50,000కే వచ్చేస్తోంది, ఎలాగో తెలుసా?
Advertisement

iPhone 16 Pro Offer: బడ్జెట్ ధరలో మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందులోనూ అది ఐఫోన్ అయితే ఆ క్రేజే వేరు. కానీ, iPhone 16 Pro లాంటి మోడల్ కొనాలంటే రూ.లక్షకు పైగా ఖర్చు చేయాలి. అంత బడ్జెట్ పెట్టి కొనడం అందరికీ కుదరకపోవచ్చు. అందుకే చాలామంది ధర ఎప్పుడు తగ్గుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు చెప్పుకునే విషయం నిజంగా గుడ్ న్యూసే. లాంచ్ సమయంలో రూ.1,09,900 ఉన్న ఈ ఫోన్ ధరను.. కొన్ని సింపుల్ ఆఫర్లతో సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం రండి..

ధర ఎలా తగ్గిందంటే?

ఈ భారీ డిస్కౌంట్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? ఇది కేవలం బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అమెజాన్ వంటి సైట్లలో ఏదైనా బ్యాంక్ కార్డ్‌ను ఉపయోగించి కొంటే నేరుగా రూ.4,000 వరకు తగ్గింపు వస్తుంది. అయితే అసలైన తగ్గింపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో‌నే ఉంది. పాత ఫోన్ కండిషన్ బాగుండి.. అది టాప్ మోడల్ అయితే ఏకంగా రూ.68,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ ఇస్తున్నారు. దీంతో ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే.. ఐఫోన్ 16 ప్రో ధర రూ.60,000 లోపు.. ఇంకా అదృష్టం బాగుంటే రూ.50,000కే వచ్చేస్తుందన్నమాట.

Advertisement

Also Read: హానర్ కొత్త ఫోన్ల రచ్చ మొదలైంది.. 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా ఫీచర్లు చూస్తే దిమ్మ తిరుగుద్ది!

ఈ ఆఫర్ ఆన్‌లైన్‌లో మాత్రమే..

అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ భారీ ఆఫర్లు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. బయట షాపులకు వెళ్లి అడిగితే ఇంత తక్కువకు దొరకడం కష్టం. అందుకే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆఫర్లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది. మీ పాత ఫోన్‌కు మంచి వాల్యూ వస్తుంది అనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

ఫీచర్లు అమోఘం..

Advertisement

ఈ iPhone 16 Proలో ఉండే 6.3 అంగుళాల డిస్‌ప్లే గేమింగ్ ఆడినా, సినిమాలు చూసినా సూపర్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఏ18 ప్రో చిప్ వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఎంత పెద్ద టాస్క్ అయినా చిటికెలో చేసేస్తుంది. ఇక కెమెరా గురించి ఎంత చెప్పినా తక్కువే. 48MP మెయిన్ కెమెరాతో పాటు 5x జూమ్ లెన్స్ ఉండటం వల్ల ఫొటోలు ప్రొఫెషనల్ రేంజ్‌లో వస్తాయి. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. పైగా ఏళ్ల తరబడి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు వస్తాయి కాబట్టి.. ఇదొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు.

Also Read: 6500mAh బ్యాటరీ, AI కెమెరాతో Motorola Edge 70 Pro ఎంట్రీ.. ధర ఎంతంటే?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×