E-Paper
Advertisement

ఫ్రిజ్ కూలింగ్ పెరగడానికి, కరెంటు ఆదా చేయడానికి 5 సింపుల్ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి !

ఫ్రిజ్ కూలింగ్ పెరగడానికి, కరెంటు ఆదా చేయడానికి 5 సింపుల్ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి !
Advertisement

Refrigerator cooling problems: ప్రస్తుతం దాదాపు అందరి ఇళ్లలో ఫ్రిజ్ వాడుతున్నారు. ఫ్రిజ్ ఆహార పదార్థాలు, కూరగాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంచుతుంది. ఎక్కువ రోజులు ఫ్రిజ్ వాడటం వల్ల కొన్ని పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. లేదంటే కంప్రెసర్ మీద భారం పడి కరెంట్ బిల్లు పెరుగుతుంది. చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడటానికి మెకానిక్‌ను పిలిచి డబ్బులు ఖర్చు పెడతారు. కొన్ని సార్లు చిన్న చిన్న కారణాలకే ఫ్రిజ్ పనిచేయక పోవచ్చు. ఇలాంటి సమయంలో తొందర పడకండి. మనం ఫ్రిజ్ కూలింగ్ సమస్యను ఇంట్లోనే గుర్తించి ఖర్చు లేకుండా ఎలా సెట్ చేసుకోవాలో అంతే కాకుండా కరెంటు బిల్లును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్ కూలింగ్ తగ్గడానికి కారణాలు:

1. ఫ్రిజ్ డోర్ గ్యాస్కెట్ చెక్ చేయండి:
ఫ్రిజ్ డోర్‌కు ఉండే రబ్బరు పట్టీనే ‘గ్యాస్కెట్’ అని పిలుస్తారు. ఇది తలుపు పట్టి ఉంచి ఫ్రిజ్ లోపలికి గాలి వెళ్లకుండా సీల్ చేస్తుంది. ఒకవేళ ఈ రబ్బరు పాతదైనా లేదా ఎక్కడైనా తెగినా.. లోపలి చల్లదనం బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది.

Advertisement

ఏం చేయాలి?: ఒక పేపర్ ముక్కను ఫ్రిజ్ తలుపు మధ్యలో పెట్టి మూసేయండి. పేపర్‌ను మీరు సింపుల్ గా బయటకు లాగగలిగితే, గ్యాస్కెట్ లూజ్ అయిందని అర్థం చేసుకోండి. ఇలాంటి సమయంలో వెంటనే దాన్ని శుభ్రం చేయండి లేదా కొత్తది మార్చడం వంటివి చేయండి.

2. కాయిల్స్ శుభ్రం చేయడం:
ఫ్రిజ్ వెనుక లేదా కింద ఉండే కాయిల్స్ మీద దుమ్ము, ధూళి పేరుకుపోవడం వల్ల వేడి బయటకు వెళ్లదు. దీంతో కూలింగ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది.

Advertisement

ఏం చేయాలి?: ఇలాంటి టైంలో పవర్ ఆఫ్ చేసి, బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్ సహాయంతో కాయిల్స్‌పై ఉన్న దుమ్మును తొలగించండి. ఇది కూలింగ్ ను 20% పెంచుతుంది. అంతే కాకుండా ఎక్కువ రోజులు ఫ్రిజ్ పాడవకుండా ఉంచుతుంది.

3. ఫ్రిజ్ చుట్టూ గాలి ఆడేలా చూడండి:

చాలామంది ఫ్రిజ్‌ను గోడకు దగ్గరగా ఆనించి పెట్టేస్తారు. దీని వల్ల కంప్రెసర్ వేడెక్కి ఆగిపోతుంది. ఫ్రిజ్ చుట్టూ గాలి బాగా ఆడితేనే అది బాగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి.

Also Read: వాల్‌నట్స్ నానబెట్టిన నీరు పారబోస్తున్నారా? ఈ లాభాలు తెలిస్తే షాక్ అవుతారు!

ఏం చేయాలి?: 

4. థర్మోస్టాట్ సెట్టింగ్స్‌:
సీజన్‌ను బట్టి తప్పకుండా థర్మోస్టాట్ సెట్టింగ్‌ను మార్చాలి. సమ్మర్ లో ఎక్కువ కూలింగ్, వర్షాకాలంలో తక్కువ కూలింగ్‌కు సెట్ చేయడం వంటివి చేయాలి. ఒక్కోసారి మనం తెలియకుండానే సెట్టింగ్ మార్చేస్తాం ఇలా అస్సలు చేయకూడదు.

ఏం చేయాలి? : ఫ్రిజ్ థర్మోస్టాట్ మధ్యస్థంగా ఉందో లేదో చెక్ చేస్తూ ఉండండి. మరీ ఎక్కువగా ఉంటే కరెంటు బిల్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

5. ఫ్రిజ్‌ను నిండుగా ఉంచకండి:
ఫ్రిజ్‌లో గాలి సర్క్యులేషన్ బాగా జరిగేలా చూడండి. మీరు ఫ్రిజ్ నిండా వస్తువులు పెట్టేస్తే..దాని లోపల గాలి తిరగడానికి స్థలం ఉండదు. దీని వల్ల కూలింగ్ సరిగ్గా అందదని గమనించండి.

ఏం చేయాలి? ఫ్రిజ్‌ను 75% వరకు మాత్రమే వాడండి. ఎయిర్ వెంట్స్‌ను అడ్డుకోకుండా జాగ్రత్త పడండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×