E-Paper
Advertisement

కొత్త స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలియకపోతే.. డబ్బులు దండగే!

కొత్త స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలియకపోతే.. డబ్బులు దండగే!
Advertisement

Smart TV Buying Guide: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంటికి స్మార్ట్ టీవీతో విడదీయరాని బంధం ఏర్పడింది. కేవలం లైవ్ టీవీ ఛానెళ్ల కోసమే కాకుండా ఓటీటీ కంటెంట్, గేమింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి ఎన్నో సదుపాయాలు ప్రస్తుతం స్మార్ట్ టీవీల్లో లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో వందల సంఖ్యలో స్మార్ట్ టీవీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా టీవీ కొనేవారికి ఇది పెద్ద సమస్యగా మారింది. మార్కెట్లోని మోడల్స్ లో ఏది కొనాలో తెలియక వారు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బెస్ట్ టీవీ ఎంపికలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన 4 అంశాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

డిస్‌ప్లే రకం, స్క్రీన్ సైజ్

టీవీ కొనేటప్పుడు అన్నింటికంటే ముందుగా చూడాల్సింది స్క్రీన్ సైజ్. గది పరిమాణాన్ని బట్టి సైజ్‌ను ఎంచుకోవడం తప్పనిసరి. చిన్న గది అయితే 32 నుంచి 43 అంగుళాలు.. పెద్ద హాల్స్ కు 55 ఇంచుల లేదా అంతకంటే ఎక్కువ సైజ్ సరిపోతుంది. ఇక డిస్‌ప్లే టెక్నాలజీ విషయానికొస్తే.. బడ్జెట్ లో టీవీ చూస్తున్నట్లైతే ఎల్‌ఈడీ (LED) తక్కువలో లభిస్తాయి. అలాకాకుండా పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉండాలనుకుంటే మాత్రం క్యూలెడ్ (QLED), ఓలెడ్ (OLED) స్క్రీన్ ఉన్న టీవీలను ఎంచుకోవడం బెస్ట్.

స్క్రీన్ రిజల్యూషన్

Advertisement

టీవీలో బొమ్మ ఎంత స్పష్టంగా కనిపిస్తుందనేది రిజల్యూషన్‌పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో 4K రిజల్యూషన్ కలిగిన టీవీలు బాగా అందుబాటులో ఉన్నాయి. మీరు 43 ఇంచులు అంతకంటే పెద్ద సైజ్ టీవీని కొనుగోలు చేయాలని భావిస్తే.. కచ్చితంగా 4K అల్ట్రా హెచ్‌డీ (Ultra HD) రిజల్యూషన్‌ ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉండి 32 ఇంచుల టీవీ తీసుకోవాలనుకుంటే ‘ఫుల్ హెచ్‌డీ’ సరిపోతుంది.

ఆపరేటింగ్ సిస్టమ్

స్మార్ట్ టీవీ పనితీరు అది ఏ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లోని గూగుల్ టీవీ (Google TV), ఆండ్రాయిడ్ టీవీ (Android TV), వెబ్ ఓఎస్ (WebOS), టైజెన్ (Tizen) వంటి ప్రముఖ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేస్తున్నాయి. వీటిలో గూగుల్ లేదా ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న టీవీలను ఎంచుకుంటే ప్లే స్టోర్ ద్వారా వేలాది యాప్‌లను, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే వాయిస్ సెర్చ్ కోసం ‘గూగుల్ అసిస్టెంట్’ ఫీచర్ ఉందో లేదో టీవీ కొనేముందే చెక్ చేసుకుంటే బెటర్.

Advertisement

Also Read: ఏసీ గదిలో మట్టి కుండ.. నిజంగానే అద్భుతం చేస్తుందా? సైన్స్ చెప్పేది ఇదే!

కనెక్టివిటీ, ఆడియో

స్మార్ట్ టీవీ కొనేముందు సెట్ టాప్ బాక్స్, హోమ్ థియేటర్, గేమింగ్ కన్సోల్ వంటివి కనెక్ట్ చేయడానికి తగినన్ని పోర్టులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం 3 హెచ్‌డీఎమ్‌ఐ (HDMI) పోర్టులు, 2 యూఎస్‌బీ (USB) పోర్టులు, బ్లూటూత్, వై-ఫై సదుపాయం ఉన్న టీవీలను ఎంచుకుంటే బెటర్ అని స్పష్టం చేస్తున్నారు. ఇక సౌండ్ విషయానికొస్తే.. టీవీల విషయంలో పిక్చర్ క్వాలిటీ తర్వాత సౌండ్ కే అంతటి ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ ఫీలింగ్ రావాలంటే కనీసం 20W నుండి 30W అవుట్‌పుట్ ఇచ్చే డాల్బీ ఆడియో (Dolby Audio) స్పీకర్లు ఉన్న టీవీని ఎంచుకుంటే బెటర్.

Also Read: సముద్ర తీర జిల్లాల్లో ఏసీ కొంటున్నారా? జాగ్రత్త భయ్యో.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×