// // Power Saving Tips: సమ్మర్‌లో AC వాడినా పవర్ బిల్లు తగ్గాలంటే.. -->
E-Paper
Advertisement

AC వేసినా రూమ్ చల్లబడట్లేదా? బహుశా మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదేనేమో, ఓసారి చెక్ చేసుకోండిలా!

AC వేసినా రూమ్ చల్లబడట్లేదా? బహుశా మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదేనేమో, ఓసారి చెక్ చేసుకోండిలా!
Advertisement

Power Saving Tips: సాధారణంగా ఎండాకాలం మొదలైందంటే.. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతుంటాయి. ఈ క్రమంలో ఉక్కపోత భరించలేక చాలామంది వెంటనే ఏదో ఒక AC కొనేద్దామని షాపులకు వెళ్తుంటారు. అక్కడ కేవలం తక్కువ ధరకో లేదా చూడటానికి బాగుందని ఏదో ఒక బ్రాండ్ ఏసీని తెచ్చేసుకుంటారు. తీరా ఇంటికి తెచ్చాక.. గది సరిగ్గా చల్లబడకపోవడమో లేదా నెల తిరిగేసరికి కరెంటు బిల్లు చూసి గుండె గుభేల్ అనడమో జరుగుతుంటుంది. అసలు సమస్య ఏసీది కాదు.. మన గదికి తగ్గ సరైన ఏసీని ఎంచుకోకపోవడమే. అందుకే ఏసీ కొనేముందు ఈ విషయాలు ఓసారి చూసుకోండి.

మీ గది సైజు ఎంత?

ఏసీ కొనడానికి వెళ్లినప్పుడు మొదట చూడాల్సింది మన గది ఎంత పెద్దది అని. చిన్న గదిలో పెద్ద ఏసీ పెడితే కరెంటు దండగ. అదే పెద్ద గదిలో చిన్న ఏసీ పెడితే అది ఎంతసేపు తిరిగినా గది చల్లబడదు. సాధారణంగా 100 చదరపు అడుగుల లోపు ఉండే చిన్న గదులకు 1 టన్ను ఏసీ సరిపోతుంది. అదే మామూలు సైజు బెడ్ రూమ్ (100-150 అడుగులు) అయితే 1.5 టన్ను తీసుకోవడం బెటర్. ఇంకా పెద్ద హాల్ లాంటి వాటికైతే 2 టన్నుల ఏసీ ఉండాల్సిందే.

గది ఏ అంతస్తులో ఉంది?

Advertisement

గది సైజుతో పాటు అది ఎక్కడ ఉందనేది కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో పై అంతస్తులో (టాప్ ఫ్లోర్) ఉండేవారికి ఎండ నేరుగా తగులుతుంది. అలాగే పడమర వైపు కిటికీలు ఉండి సాయంత్రం దాకా ఎండ పడే గదులు త్వరగా వేడెక్కుతాయి. ఇలాంటి గదులు ఉన్నవారు మామూలు కంటే కాస్త ఎక్కువ కెపాసిటీ ఉన్న ఏసీని ఎంచుకోవడం మంచిది. లేదంటే గది చల్లబడటానికి చాలా టైమ్ పడుతుంది.

Also Read: మూడు 200MP కెమెరాలతో Xiaomi 17 Max సరికొత్త రికార్డు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

గదిలో ఎంతమంది ఉంటారు?

Advertisement

మరో ముఖ్యమైన విషయం.. ఆ గదిలో ఎంతమంది ఉంటారు? అనేది. గదిలో ఎక్కువ మంది జనం ఉన్నా, లేదా గదిలో వేడిని పుట్టించే టీవీలు, కంప్యూటర్లు, గేమింగ్ సిస్టమ్స్ లాంటివి ఉన్నా ఏసీ మీద లోడ్ పెరుగుతుంది. అందుకే గదిలో ఉండే జనాన్ని, వస్తువులను బట్టి కూడా మన ఏసీ పవర్ ఉండాలి. అప్పుడే కంప్రెసర్ మీద భారం పడకుండా గది త్వరగా చల్లబడుతుంది.

ఇన్వర్టర్ ఏసీలే ఇప్పుడంతా..

ఇప్పుడు మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీలు బాగా పాపులర్ అయ్యాయి. వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. గది చల్లబడగానే కంప్రెసర్ వేగాన్ని తగ్గించి కరెంటును ఆదా చేస్తాయి. ముఖ్యంగా 3 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ ఏసీలు తీసుకుంటే నెలవారీ బిల్లులో చాలా మార్పు కనిపిస్తుంది. మొదట్లో కొంచెం రేటు ఎక్కువ అనిపించినా.. లాంగ్ రన్‌లో చాలా వరకు డబ్బులు మిగులుస్తాయి.

మన్నికైనది ఎంచుకోండిలా..

ఏసీలో ఫీచర్లు ఎన్ని ఉన్నా.. అది ఎంతకాలం మన్నుతుందనేది ముఖ్యం. ఎప్పుడైనా సరే కాపర్ కండెన్సర్ ఉన్న మోడల్స్ తీసుకోవడం ఉత్తమం. ఇవి త్వరగా పాడవవు, రిపేర్లు కూడా తక్కువగా వస్తాయి. ఇక ఇప్పుడు వస్తున్న కన్వర్టిబుల్ ఏసీలు అయితే మరీ మంచిది. బయట వాతావరణాన్ని బట్టి ఏసీ పవర్‌ను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వై-ఫై, యాప్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు సౌకర్యంగా ఉన్నా, కూలింగ్ సామర్థ్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

Also Read: ధర తక్కువ అని పెద్ద గదికి 1 టన్ ఏసీ కొన్నారా? ఏం పర్లేదు.. ఇలా చెయ్యండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×