E-Paper
Advertisement

మీ గూగుల్ అకౌంట్ వేరే డివైజుల్లో ఉండిపోయిందా? ఇలా సింపుల్‌గా రిమూవ్ చేయండి!

మీ గూగుల్ అకౌంట్ వేరే డివైజుల్లో ఉండిపోయిందా? ఇలా సింపుల్‌గా రిమూవ్ చేయండి!
Advertisement

Google Account: నేటి టెక్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత పెరిగిందో.. ఆన్‌లైన్ మోసాలు కూడా అంతే స్పీడ్‌గా పెరుగుతున్నాయి. అందుకే పర్సనల్ డీటెయిల్స్‌ను జాగ్రత్తగా ఉంచుకోవడం మన బాధ్యత. కొన్నిసార్లు అర్జెంట్ పని ఉండి నెట్ సెంటర్లలోనో, లేదంటే స్నేహితుల ఫోన్లలోనో మన ఈ-మెయిల్ ఐడి లాగిన్ చేస్తుంటాం. కానీ పని అయిపోయాక లాగౌట్ చేయడం కొన్నిసార్లు గుర్తుండదు. దీనివల్ల మన ప్రైవేట్ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే.. మీ గూగుల్ అకౌంట్ ఏయే ఫోన్లలో, కంప్యూటర్లలో ఓపెన్ అయి ఉందో అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

సెట్టింగ్స్ ద్వారా చెక్ చేయడమెలా?

స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా గూగుల్ అకౌంట్‌లోకి వెళ్లి, అక్కడ Security అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులోRecent activity అనే చోట మీ ఈ-మెయిల్ ఐడి ఏయే డివైజుల్లో వాడుతున్నారో క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకవేళ అందులో మీకు సంబంధం లేని ఫోన్ గానీ, కంప్యూటర్ గానీ కనిపిస్తే.. వెంటనే దాని మీద క్లిక్ చేసి No, Secure My Account అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అంతే.. ఆ కొత్త డివైజ్ నుండి మీ అకౌంట్ మాయమైపోతుంది.

Advertisement

Also Read: ఏమన్నా ప్లాన్ చేశావా ఒప్పో మావా.. 8,000mAh బ్యాటరీ, లైవ్ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌తో ‘Pad Mini’ రెడీ!

డైరెక్ట్ లింక్ ద్వారా క్లియర్ చేయొచ్చు..

ఇంకా ఈజీగా చెప్పాలంటే.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో myaccount.google.com అని సెర్చ్ చేయండి. వెంటనే మీ అకౌంట్ సెట్టింగ్స్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ప్రొఫైల్ కింద ఉండే Devices అనే చోట క్లిక్ చేస్తే, మీ ఈ-మెయిల్ లింక్ అయి ఉన్న ఫోన్ల లిస్ట్ అంతా వచ్చేస్తుంది. మీకు పరిచయం లేని డివైజ్‌లను అక్కడ నుండి ఈజీగా డిస్‌కనెక్ట్ చేయొచ్చు. అవసరమైతే మీ పాస్‌వర్డ్ కొట్టి సెక్యూరిటీని మరింత పెంచుకోవచ్చు.

అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలంటే?

Advertisement

కేవలం లాగౌట్ చేయడమే కాదు.. మీ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే అప్పుడప్పుడు పాస్‌వర్డ్ మారుస్తూ ఉండాలి. అలాగే రికవరీ ఫోన్ నంబర్, వేరే ఈ-మెయిల్ ఐడిని కూడా యాడ్ చేసి ఉంచుకోవాలి. రేపు పొద్దున మీ అకౌంట్‌కు ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే పాస్‌వర్డ్ మర్చిపోయినా, వీటి సాయంతో అకౌంట్‌ను మళ్లీ రికవరీ చేసుకోవచ్చు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కదా.

Also Read: ఐఫోన్ ఫోల్డ్ వచ్చేస్తోంది.. హింజ్ విషయంలో యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×