E-Paper
Advertisement

Battery Life Tips: ఎంతసేపటికీ ఫోన్ ఛార్జ్ అవ్వడం లేదా?.. ఈ సింపుల్ టిప్స్‌తో బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోండి!

Battery Life Tips: ఎంతసేపటికీ ఫోన్ ఛార్జ్ అవ్వడం లేదా?.. ఈ సింపుల్ టిప్స్‌తో బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోండి!
Advertisement

Battery Life Tips: మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతుందా? దీంతో విసిగిపోయి కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం.. ఒక్క నిమిషం ఆగండి. మీ స్మార్ట్‌ఫోన్ వేగంగా, సురక్షితంగా ఛార్జ్ అవ్వాలంటే.. కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలంటున్నారు టెక్ నిపుణులు. దీంతో కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేకుండానే.. ప్రస్తుత ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అదెలాగంటే..

ఏరోప్లేన్ మోడ్:

స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసే సమయంలో నెట్‌వర్క్ సిగ్నల్స్, లొకేషన్, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ బ్యాటరీను వేగంగా ఖర్చు చేసేస్తాయి. కాబట్టి ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టేటప్పుడు.. ఏరోప్లేన్ మోడ్‌లో ఆన్ చేయండి. దీంతో ఛార్జింగ్ వేగం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఛార్జ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరం.

పవర్ సేవింగ్ మోడ్:

Advertisement

ఒకవేళ ఏరోప్లేన్ మోడ్ పెట్టలేకపోతుంటే.. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పవర్ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయండి. ఇది బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ని ఆపి, ఫోన్ పవర్‌ను వృధా కాకుండా చూసుకుంటుంది. ఫలితంగా.. ఛార్జింగ్ వేగం పెరుగుతుంది.

ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ ఆన్:

రాత్రంతా ఫోన్‌ను ఛార్జ్ పెట్టే అలవాటు ఉన్నవారికి Optimized battery charging లేదా Adaptive Protection ఆన్ చేయడం అవసరం. ఇది బ్యాటరీని 80 శాతం పూర్తయిన తర్వాత కాస్త మెల్లగా ఛార్జ్ చేస్తుంది. దీంతో ఫోన్ వేడెక్కకుండా, బ్యాటరీకి హాని కలగకుండా కాపాడుతుంది.

బ్యాక్ కవర్ తీసేయండి:

Advertisement

కొన్నిసార్లు ఛార్జింగ్ సమయంలో ఫోన్ విపరీతంగా వేడెక్కి పోతుంటుంది. నిజానికి ఈ వేడే బ్యాటరీకి అసలైన శత్రువు. కాబట్టి.. చార్జింగ్ పెట్టేముందు ఫోన్ కవర్ తీసేస్తే.. ఫోన్ చల్లగా ఉంటుంది. అలాగే గాలి తగిలి ఛార్జింగ్ వేగం కూడా పెరుగుతుంది.

ఒరిజినల్ ఛార్జరే వాడాలి:

స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ కేబుల్, అడాప్టర్‌ను మాత్రమే వాడాలి. ఇవి సరైన పవర్‌ను అందిస్తాయి. అదనంగా.. సెట్టింగ్స్‌లో Fast Charging ఆప్షన్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయడం మర్చిపోకండి.

ఛార్జింగ్ పరిమితులు పాటించాలి:

పాత స్మార్ట్‌ఫోన్‌లలో ఆప్టిమైజ్డ్ ఫీచర్ లేకపోవచ్చు. అందువల్ల బ్యాటరీని 20 శాతం కంటే.. తక్కువకు తగ్గనివ్వకండి. దీంతోపాటు 80 శాతం కంటే.. ఎక్కువ ఛార్జ్ కూడా చేయకండి. దీని వల్ల బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువ రోజులు కాపాడుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×