// // ఛార్జర్ లేకుండానే ఫోన్ నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు.. ఎలాగంటే! -->
E-Paper
Advertisement

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!
Advertisement

Phone Charging Tips: ప్రయాణాలు చేసేటప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు మనల్ని ఎక్కువగా వేధించే సమస్య ఫోన్ ఛార్జింగ్. బయటికి వెళ్లిన ప్రతిసారీ ఛార్జర్లు, పవర్ అడాప్టర్లు వెంట తీసుకెళ్లడం కుదరకపోవచ్చు. ఇంకొన్నిసార్లు ఏమౌతుందంటే.. ఎక్కడికైనా వెళ్లాలి అనే హడావిడిలో ఛార్జర్ తీసుకెళ్లడం మర్చిపోతుంటారు కొందరు. అయితే మీ వద్ద USB కేబుల్ లేదా ఒక మంచి పవర్ బ్యాంక్ ఉంటే చాలు.. ఛార్జర్లు వెంట తీసుకెళ్లాల్సిన అవసరమే ఉండదు.

పబ్లిక్ USB పోర్ట్‌లతో సులువుగా..

ఈ రోజుల్లో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్‌లు, కేఫ్‌లు, షాపింగ్ మాల్స్‌లో పబ్లిక్ USB ఛార్జింగ్ పోర్ట్‌లు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి.. ఛార్జర్ లేకపోయినా ఈ USB కేబుల్ ద్వారా ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే పబ్లిక్ పోర్ట్‌లను వాడేటప్పుడు సైబర్ భద్రత దృష్ట్యా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే వీటిలో ఛార్జింగ్ కాస్త నెమ్మదిగా ఎక్కుతుందని గుర్తుంచుకోవాలి.

Advertisement

Also Read: వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

వైర్‌లెస్ ఛార్జింగ్ ప్రత్యామ్నాయాలు:

ఒకవేళ మీ వద్ద కేబుల్ కూడా లేకపోతే.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే ప్రదేశాలను వెతకడం మరొక మంచి మార్గం. ప్రస్తుతం అనేక నగరాల్లో వైర్‌లెస్ ఛార్జింగ్ స్పాట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రత్యేకమైన యాప్‌ల ద్వారా మీకు సమీపంలో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్ పాయింట్లను సులభంగా కనుక్కోవచ్చు. ఫోన్‌ను ఆ ప్యాడ్‌పై ఉంచితే చాలు.. కేబుల్స్ అవసరం లేకుండానే ఛార్జింగ్ అవుతుంది.

స్మార్ట్ పవర్ బ్యాంక్‌లు:

Advertisement

ప్రయాణాల్లో కచ్చితంగా మన వెంట తీసుకెళ్లాల్సిన పరికరం పవర్ బ్యాంక్. ఇవి ఇప్పుడు చాలా స్లిమ్‌గా, జేబులో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకునేలా వస్తున్నాయి. ఫోన్ వెనుక సులభంగా అతుక్కునే మాగ్‌సేఫ్ (MagSafe) పవర్ బ్యాంక్‌లు లేదా ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే కేస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్లో దొరికే చౌకబారు పవర్ బ్యాంక్‌ల కంటే భద్రతా ప్రమాణాలు కలిగిన మంచి కంపెనీ పవర్ బ్యాంక్‌లను ఎంచుకోవడం చాలా సురక్షితం.

Also Read: వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×