E-Paper
Advertisement

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ పోగోట్టుకున్నారా? బ్యాంక్‌కు వెళ్లకుండానే నిమిషాల్లో బ్లాక్ చేయండిలా!

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ పోగోట్టుకున్నారా? బ్యాంక్‌కు వెళ్లకుండానే నిమిషాల్లో బ్లాక్ చేయండిలా!
Advertisement

Card Theft Protection: కరోనా తర్వాత మన దేశంలో నగదు రహిత లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. ఆన్‌లైన్ షాపింగ్ నుండి కిరాణా కొట్టు వరకు అంతా క్రెడిట్, డెబిట్ కార్డులతోనే సాగిపోతోంది. దీనివల్ల డబ్బులు క్యారీ చేసే అవసరం లేకుండా పనులు సులువుగా అవుతున్నాయి. అయితే, ఈ కార్డులను ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా అంతే వేగంగా మన అకౌంట్‌లోని డబ్బు మాయమయ్యే ప్రమాదం ఉంది. మోసగాళ్లు మన కార్డ్ వివరాలతో డబ్బులు విత్‌డ్రా చేయడం లేదా అక్రమ కొనుగోళ్లు చేయడం లాంటివి చేయొచ్చు. అందుకే కార్డ్ పోయిన వెంటనే దాన్ని బ్లాక్ చేయడం చాలా ముఖ్యం.

మొబైల్ యాప్ ద్వారా సులభంగా..

మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లే సమయం లేనప్పుడు మీ ఫోన్‌లోని అఫీషియల్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా నిమిషాల్లో కార్డ్ బ్లాక్ చేయొచ్చు. ముందుగా యాప్‌లోకి లాగిన్ అయి.. Cards సెక్షన్‌కు వెళ్లాలి. అక్కడ మీ కార్డును సెలెక్ట్ చేసుకొని Manage Card లేదా Support ఆప్షన్‌పై నొక్కాలి. అందులో Permanent Block and Reissue అనే ఆప్షన్ ఎంచుకొని, మీ నిర్ణయాన్ని కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ కార్డ్ బ్లాక్ అయిపోయి.. మెసేజ్ వస్తుంది.

Advertisement

Also Read: అల్టిమేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Honor X80 రెడీ!

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో..

మీరు గనుక నెట్ బ్యాంకింగ్ వాడుతుంటే.. మీ కంప్యూటర్ లేదా ఫోన్ బ్రౌజర్‌లో బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. మెనూలో ఉన్న Cards విభాగంలోకి వెళ్లి, మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కార్డ్ నెంబర్ చివరి నాలుగు అంకెలను చూసి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ Block Card ఆప్షన్ నొక్కి, కార్డ్ పోవడానికి గల కారణాన్ని తెలియజేసి ఓకే చేయాలి. క్షణాల్లో మీ కార్డ్ సర్వీస్ ఆగిపోతుంది.

ఒక్క SMSతో పని పూర్తి..

Advertisement

ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. ప్రతి బ్యాంక్ కార్డ్ బ్లాక్ చేయడానికి ఒక ప్రత్యేక SMS ఫార్మాట్, టోల్ ఫ్రీ నెంబర్‌ను అందిస్తుంది. మీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు చూసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి ఆ ఫార్మాట్‌లో మీ కార్డ్ చివరి నాలుగు అంకెలను టైప్ చేసి మెసేజ్ పంపాలి. మీ అభ్యర్థన అందిన వెంటనే బ్యాంక్ ఆ కార్డును శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది.

Also Read: 144Hz డిస్‌ప్లే, 100x జూమ్ కెమెరాతో Vivo S60 సిరీస్ లాంచ్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×