E-Paper
Advertisement

Cooler Bad Smell Solution: కూలర్ నుంచి బ్యాడ్ స్మెల్‌ వస్తోందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే ప్రాబ్లమ్ సాల్వ్

Cooler Bad Smell Solution: కూలర్ నుంచి బ్యాడ్ స్మెల్‌ వస్తోందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే ప్రాబ్లమ్ సాల్వ్
Advertisement

Cooler Bad Smell Solution: సమ్మర్‌లో చాలా మంది ఇళ్లలో కూలర్ ఉపయోగిస్తారు. ఇది గదిని చల్లగా ఉంచడంలో సహాయ పడుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కూలర్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడం చాలా సాధారణ సమస్య. ఇది ఎక్కువగా నీరు నిల్వ ఉండటం, కూలర్ ప్యాడ్స్ సరిగా శుభ్రం చేయకపోవడం లేదా బ్యాక్టీరియా పెరగడం వల్ల జరుగుతుంది. ఈ సమస్య వల్ల గదిలో గాలి కూడా వాసన వస్తుంది. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే.. మాత్రం కూలర్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్‌ను సింపుల్ గా తొలగించవచ్చు.

1.కూలర్ వాటర్ మార్చండి:
కూలర్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడానికి ప్రధాన కారణం నీరు ఎక్కువ రోజుల పాటు మార్చకపోవడం. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే.. దానిలో బ్యాక్టీరియా, ఆల్గే పెరుగుతాయి. అందుకే కూలర్లోని నీటిని కనీసం 2 లేదా 3 రోజులకు ఒకసారి మార్చడం మంచిది. అంతే కాకుండా ఫ్రెష్ వాటర్ వాడితే కూలర్ గాలి కూడా శుభ్రంగా ఉంటుంది.

Advertisement

2. కూలర్ ప్యాడ్స్:
కూలర్‌లోని కూలింగ్ ప్యాడ్లు దుమ్ము, మలినాలను త్వరగా గ్రహిస్తాయి. ఇవి శుభ్రం చేయక పోతే.. చెడు వాసన వస్తుంది. కాబట్టి నెలకు ఒకసారి కూలర్ ప్యాడ్స్‌ను తీసి నీటితో బాగా కడగాలి. అవసరం అయితే మైల్డ్ సోప్ లేదా వెనిగర్‌తో క్లీన్ చేయండి.

3. కూలర్ ట్యాంక్:
కూలర్ ట్యాంక్‌లో మురికి పేరుకు పోతే స్మెల్ రావడం సాధారణం. అందుకే ట్యాంక్‌ను వారానికి ఒకసారి ఖాళీ చేసి బ్రష్ లేదా క్లాత్‌ తో శుభ్రం చేయాలి. ఇది బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది.

Advertisement

4. నిమ్మ లేదా వెనిగర్:
కూలర్‌లోని వాసనను తగ్గించడానికి నిమ్మసం లేదా వెనిగర్ ఉపయోగించవచ్చు. కొద్దిగా వెనిగర్‌ను నీటిలో కలిపి కూలర్ ట్యాంక్‌లో పోస్తే.. బ్యాక్టీరియా తగ్గుతుంది. అలాగే నిమ్మ స్మెల్ వల్ల గాలికూడా ఫ్రెష్ గా ఉంటుంది.

5. కూలర్‌ను ఎండలో ఉంచండి:
కూలర్‌లో తేమ ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా పెరుగుతాయి. అందుకే కొన్ని రోజులకోసారి కూలర్‌ను ఎండలో కొద్దిసేపు ఉంచడం మంచిది. ఇది చెడు వాసన రాకుండా చేస్తుంది.

Also Read: ఇండక్షన్ స్టౌ గురించి 10 సీక్రెట్స్ .. చాలా మందికి తెలియని నిజాలు !

6. గాలి సరిగ్గా రావాలి ?
కూలర్ పనిచేసేటప్పుడు గదిలో సరైన వెంటిలేషన్ ఉండాలి. గది పూర్తిగా మూసి ఉంచితే గాలి ప్రసరణ సరిగా ఉండదు. కాబట్టి కిటికీలు కొంచెం తెరిచి ఉంచితే ఫ్రెష్ గాలి వస్తుంది.

Also Read: రూ.2000 లోపు బెస్ట్ ఇండక్షన్లు (2026) – టాప్ 5 మోడల్స్, ఫీచర్లు & ధర

7. ఎయిర్ కూలర్ క్లీనింగ్ ట్యాబ్లెట్లు  :
మార్కెట్లో కూలర్ కోసం ప్రత్యేకంగా ఎయిర్ కూలర్ క్లీనింగ్ ట్యాబ్లెట్లు లభిస్తాయి. ఇవి నీటిలో కలిపితే బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయి. దీని వల్ల కూలర్ నుంచి వచ్చే స్మెల్ తగ్గుతుంది.

కూలర్ స్మెల్ రాకుండా ఉండాలంటే ?

ప్రతి 2–3 రోజులకు వాటర్ మార్చండి.

నెలకు ఒకసారి కూలింగ్ ప్యాడ్స్ క్లీన్ చేయండి.

కూలర్ ట్యాంక్ శుభ్రంగా ఉంచండి.

ఫ్రెష్ వాటర్ మాత్రమే వాడండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×