E-Paper
Advertisement

లాంచ్‌కు ముందే లీకైన హానర్ కొత్త ఫోన్ ఫొటోలు.. ఏకంగా 11,000mAh బ్యాటరీతో!

లాంచ్‌కు ముందే లీకైన హానర్ కొత్త ఫోన్ ఫొటోలు.. ఏకంగా 11,000mAh బ్యాటరీతో!
Advertisement

Honor X80 Pro Max: ప్రముఖ హానర్ కంపెనీ నుంచి త్వరలోనే Honor X80 సిరీస్ మార్కెట్లోకి రాబోతోంది. ఇందులో భాగంగా Honor X80, X80 Pro మోడళ్లతో పాటు ప్రీమియం లుక్‌తో Honor X80 Pro Max కూడా విడుదల కానుంది. అయితే అధికారిక ప్రకటన కంటే ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన లైవ్ ఫొటోలు, కొన్ని ముఖ్యమైన ఫీచర్లు సోషల్ మీడియాలో లీకై సందడి చేస్తున్నాయి.

డ్యూయల్ టోన్ డిజైన్:

లీకైన ఫొటోల ప్రకారం చూస్తే.. ఈ ఫోన్ వెనుక భాగం లీడర్ టెక్స్చర్‌తో, రెండు రకాల రంగుల కలయికతో (డ్యూయల్ టోన్) చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఫోన్ పైభాగం క్రీమ్ కలర్‌లో, కింది భాగం ఆరెంజ్ షేడ్‌లో డిజైన్ చేశారు. అలాగే కింది వైపు గోల్డ్ కలర్ ఫినిషింగ్‌తో ఆనర్ బ్రాండింగ్ ఇచ్చారు. మొత్తానికి ఫోన్ లుక్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది.

Advertisement

Also Read: ఇంట్లోనే స్టేడియం లాంటి మజా.. క్రికెట్ లవర్స్ కోసం LG తెచ్చిన స్పెషల్ TV!

కెమెరా, డిస్‌ప్లే ఎలా ఉందంటే?

ఈ ఫోన్ వెనుక వైపు గతంలో వచ్చిన హానర్ మ్యాజిక్ సిరీస్ తరహాలోనే ఒక పెద్ద గుండ్రటి (సర్క్యులర్) కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ముందు భాగంలో చాలా సన్నని బెజెల్స్‌తో పాటు సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ మధ్యలో పంచ్‌హోల్ కటౌట్ ఇచ్చారు. ఇందులో 6.8 అంగుళాల ఓఎల్ఈడీ (OLED) డిస్‌ప్లేను ఉపయోగించినట్లు సమాచారం.

పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రాసెసర్:

Advertisement

ఈ ఫోన్ ప్రత్యేకతల్లో మెయిన్ హైలైట్ దీని బ్యాటరీనే అని చెప్పాలి. దీనిలో ఏకంగా 11,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇస్తున్నట్లు టాక్. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని లీకుల ద్వారా తెలుస్తోంది.

త్వరలోనే లాంచ్:

ఈ ఫోన్‌ను పూర్తి వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు కింద పడినా పగలకుండా ఉండేలా బలమైన డిజైన్‌తో తీసుకొస్తున్నారు. ఈ నెల చివర్లోనే Honor X80 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో వనిల్లా మోడల్ అయిన Honor X80 కూడా 10,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో విడుదల కానుంది.

Also Read: నీటిలో మునిగినా, కింద పడినా ఏమీ కాదు.. మోటరోలా నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ 5G ఫోన్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×