E-Paper
Advertisement

అల్టిమేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Honor X80 రెడీ!

అల్టిమేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Honor X80 రెడీ!
Advertisement

Honor X80: స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో హానర్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు అందించడంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో హానర్ నుంచి Honor X80 మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. జూన్ నెలలోనే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ Honor X80లో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రధాన అంశం దీని బ్యాటరీనే. ఏకంగా 10000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడం కోసం 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. గేమ్స్ ఆడేవారికి, ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఇది బాగా సెట్ అవుతుంది.

Advertisement

Also Read: అండర్‌ వాటర్ కెమెరా, 7200mAh బ్యాటరీతో Vivo T5 లాంచ్.. ఫోన్ లుక్ అదిరిపోయింది!

ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. Honor X80 ఫోన్‌లో 6.8 ఇంచుల ఫ్లాట్ LTPS ఓఎల్ఈడీ స్క్రీన్‌ను ఇస్తున్నారు. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీంతో ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా, కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక లుక్ పరంగా కూడా యువతను ఆకట్టుకునేందుకు మిస్టిక్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, లైట్నింగ్ రెడ్, వైబ్రెంట్ ఆరెంజ్ వంటి సూపర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించనుంది.

Advertisement

ఈ ఫోన్ Snapdragon 6 Gen 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని అంచనా. రోజువారీ పనులతో పాటు గేమింగ్‌కు కూడా ఇది చక్కగా సెట్ అవుతుంది. ఫోన్ కింద పడినా పాడవకుండా ఉండేందుకు దీని బాడీని చాలా బలంగా, షాక్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో డిజైన్ చేశారు. గతంలో వచ్చిన మోడల్ సుమారు 70 లక్షల యూనిట్లు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఆ నమ్మకంతోనే మరిన్ని మెరుగైన కెమెరా ఫీచర్లతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. పవర్‌ఫుల్ ఫీచర్లు, రీజనబుల్ ధరలో వచ్చే ఈ ఫోన్ మార్కెట్లో ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేయనుంది.

Also Read: వావ్.. రాత్రిపూట ఏసీని Sleep Modeలో పెడితే.. కరెంట్ బిల్లు ఇంతలా తగ్గుతుందా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×