E-Paper
Advertisement

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!
Advertisement

Honor X7e Plus 5G: గతంలో వచ్చిన హానర్ X7e 4G మోడల్‌కు మంచి స్పందన లభించడంతో.. కంపెనీ ఇప్పుడు మరింత శక్తివంతమైన ఫీచర్లతో Honor X7e Plus 5Gని గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అదనపు బ్యాటరీ సపోర్ట్, మెరుగైన ప్రాసెసర్, కొత్త AI ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

డిస్‌ప్లే, ప్రత్యేక AI బటన్:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.87 ఇంచుల HD+ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,020 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కంటికి రక్షణగా ఐ-కంఫర్ట్ మోడ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని ప్రత్యేక AI బటన్. ఈ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా సర్కిల్ టు సెర్చ్, AI ఎరేజర్, AI సమ్మరీ వంటి సరికొత్త ఫీచర్లను చాలా వేగంగా వాడవచ్చు.

Advertisement

Also Read: జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

మల్టీటాస్కింగ్‌కు బెస్ట్ ఆప్షన్:

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ సపోర్ట్ వల్ల మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ OS 10పై ఈ డివైజ్ రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ముందు వైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

Honor X7e Plus 5G యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 8,100mAh భారీ బ్యాటరీ. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. తీవ్రమైన వేడి, చలి వాతావరణంలో కూడా ఇది సులభంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. కింద పడినా త్వరగా పాడవకుండా వాటర్, డస్ట్ ప్రూఫ్‌తో పాటు అత్యుత్తమ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్‌ను రూపోందించారు.

ధర వివరాలు:

ప్రస్తుతానికి ఈ ఫోన్ ఖతార్, ఒమన్ దేశాల్లో విడుదలైంది. ఖతార్‌లో 6GB ర్యామ్ వేరియంట్ ధర సుమారు రూ.23,000 కాగా, 8GB వేరియంట్ ధర రూ.25,000గా ఉంది. ఇది గోల్డ్, బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. త్వరలోనే ఇతర దేశాల మార్కెట్లలోకి కూడా రానుంది.

Also Read: iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×