E-Paper
Advertisement

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!
Advertisement

Honor X7e: హానర్ సంస్థ గ్లోబల్ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విడుదల చేసింది. Honor X7e పేరుతో వచ్చిన ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని భారీ బ్యాటరీనే. ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. మిడ్‌నైట్ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ మొబైల్ లభిస్తోంది.

ఈ Honor X7e ఫోన్ కొనేవారిని ఆకట్టుకునే ప్రధాన ఫీచర్ దీని బ్యాటరీ లైఫ్. ఇందులో ఏకంగా 7,500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఇది 45W వైర్డ్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది 7,000mAh బ్యాటరీతో రానుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల HD+ LCD స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది.

Advertisement

Also Read: యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

హానర్ X7e స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ప్రొసెసర్‌తో రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10.0 వెర్షన్‌పై పనిచేస్తుంది. బడ్జెట్ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఆశించేవారికి ఇది బాగా సెట్ అవుతుంది.

Advertisement

ఫొటోల కోసం ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాతో పాటు మరో సహాయక లెన్స్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్, హెడ్‌ఫోన్ జాక్, ఒక ప్రత్యేకమైన వన్-టాప్ AI కీని ఇందులో చేర్చారు.

ప్రస్తుతానికి ఈ ఫోన్ మలేషియాలో ఒకే ఒక్క వేరియంట్ (6GB RAM + 256GB స్టోరేజ్)లో అందుబాటులో ఉంది. అక్కడ దీని ధర రూ.18,500 పైమాటే. బ్లూటూత్ 5.1, డ్యూయల్ బ్యాండ్ వైఫై, టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×