E-Paper
Advertisement

Honor X6d: రూ.12,600కే 50MP కెమెరా, భారీ బ్యాటరీ.. హానర్ నుంచి కొత్త 5G ఫోన్ విడుదల!

Honor X6d: రూ.12,600కే 50MP కెమెరా, భారీ బ్యాటరీ.. హానర్ నుంచి కొత్త 5G ఫోన్ విడుదల!
Advertisement

Honor X6d: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ హానర్ తన బడ్జెట్ ఫోన్లను మరింత విస్తరిస్తూ హానర్ X6d పేరుతో మరో కొత్త 5G మొబైల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో విడుదలైన ఈ ఫోన్, తక్కువ ధరలో మంచి ఫీచర్లను కోరుకునే వారిని ఆకట్టుకుంటోంది. గత ఏడాది చైనాలో వచ్చిన హానర్ ప్లే 60A మోడల్‌కు ఇది గ్లోబల్ వెర్షన్‌గా తెలుస్తోంది.

హానర్ X6d చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీని వెనుక భాగంలో గ్లోసీ ఫినిషింగ్‌తో స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాగే దీనిలో 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను అందించారు. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌ను ఉపయోగించారు. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో యాపిల్, గూగుల్ మధ్య అసలైన పోటీ.. ఏ ఫోన్ కొనడం బెటర్?

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. బడ్జెట్ ధరలో మెరుగైన 5G కనెక్టివిటీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనిలో 4GB RAM, ఏకంగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండటం విశేషం. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా చూసుకుంటే, ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OS 9పై రన్ అవుతుంది.

Advertisement

ఇకపోతే ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది మంచి క్వాలిటీ ఫొటోలను, 1080p వీడియోలను రికార్డ్ చేయగలదు. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే 5,260mAh భారీ బ్యాటరీని అందించారు.

UAE మార్కెట్లో ఈ ఫోన్ సుమారు రూ.12,600 ధర పలుకుతోంది. ఇది మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ సైన్ రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం ఇతర దేశాల్లో దీని విడుదలపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే ఇది మరిన్ని మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: లావా సరికొత్త యాడ్.. మొబైల్ సర్వీస్ సెంటర్లపై అదిరిపోయే సెటైర్, నవ్వకుండా ఉండలేరు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×