E-Paper
Advertisement

ఐఫోన్ కంటే తక్కువ బరువు.. బ్యాటరీ మాత్రం 14000mAh, హానర్ సంచలన నిర్ణయం!

ఐఫోన్ కంటే తక్కువ బరువు.. బ్యాటరీ మాత్రం 14000mAh, హానర్ సంచలన నిర్ణయం!
Advertisement

Honor New Phone: ప్రస్తుత మొబైల్ మార్కెట్‌లో పెద్ద బ్యాటరీల హవా నడుస్తోంది. మొన్నటివరకు 5000mAh బ్యాటరీలే ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు మొబైల్ తయారీ సంస్థలు అంతకంటే పెద్ద బ్యాటరీలతో ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ రేసులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ అందరికంటే ఒకడుగు ముందే ఉంది. ఇటీవల చైనాలో ఏకంగా 11000mAh బ్యాటరీతో ఓ ఫోన్‌ను లాంచ్ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు అంతకుమించిన భారీ బ్యాటరీ ఫోన్‌పై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ సమాచారం ప్రకారం.. హానర్ 14000mAh బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను టెస్ట్ చేస్తోంది.

తక్కువ బరువుతో పెద్ద బ్యాటరీ:

సాధారణంగా పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా, లావుగా తయారవుతుందని అందరూ అనుకుంటారు. కానీ హానర్ ఈ విషయంలో ఒక అద్భుతాన్నే చేయబోతోంది. ఈ 14000mAh బ్యాటరీ ఫోన్ బరువు కేవలం 220 గ్రాముల లోపే ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొన్ని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లు (ఉదాహరణకు ఐఫోన్ 17 ప్రో మాక్స్ బరువు 233 గ్రాములు) దీనికంటే ఎక్కువే ఉన్నాయి. అంతకంటే తక్కువ బరువుతోనే ఇంత పెద్ద బ్యాటరీని అందించడం నిజంగా విశేషమనే చెప్పాలి.

Advertisement

Also Read: సర్వీస్ సెంటర్‌కు వెళ్లడానికి ముందే.. ల్యాప్‌టాప్ రిపేర్ ఖర్చులను ఇంట్లోనే తెలుసుకోవచ్చు!

నాలుగు రోజులకు పైగా ఛార్జింగ్:

ఈ ఫోన్ గనుక మార్కెట్లోకి వస్తే ఛార్జింగ్ గురించిన భయాలు పూర్తిగా తొలగిపోతాయి. హానర్ గతంలో తెచ్చిన బ్యాటరీల రికార్డులను బట్టి చూస్తే.. ఈ 14000mAh ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సామాన్య వినియోగదారులకు కనీసం నాలుగు రోజులకు పైగా బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి, రోజంతా బయటే ఉండేవారికి ఇది చాలా ప్లస్ అవుతుంది. అయితే ఇంత పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయడానికి హానర్ కచ్చితంగా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా జోడించాల్సి ఉంటుంది.

గ్లోబల్ మార్కెట్‌లోకి రావడం కష్టమేనా?

Advertisement

ఈ ఫోన్ ఫీచర్లు వినడానికి ఎంత బాగున్నా.. ఇది ఇండియా లేదా ఇతర దేశాల్లో లాంచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే యూరప్ వంటి దేశాల్లో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యంపై కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ 14000mAh కెపాసిటీ ఆ నిబంధనలను దాటే అవకాశం ఉంది. ఒకవేళ హానర్ అంతర్జాతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా బ్యాటరీ డిజైన్‌ను మారిస్తే తప్ప, ఈ ఫోన్ కేవలం చైనా మార్కెట్‌కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.

మారబోతున్న మొబైల్ ట్రెండ్:

ఇటీవలి కాలంలో పెర్ఫార్మెన్స్ కంటే బ్యాటరీ లైఫ్‌కు యూజర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రియల్‌మీ కూడా మొన్నే 10001mAh బ్యాటరీతో ఒక ఫోన్ తెచ్చింది. హానర్ తీసుకురాబోయే ఈ కొత్త ఫోన్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో మిగతా బ్రాండ్స్ కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి ఇది కేవలం లీక్ మాత్రమే కాబట్టి.. అత్యవసరంగా కొత్త ఫోన్ కావాలనుకునే వారు దీనికోసం ఎదురుచూడకుండా మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్లను ఎంచుకోవడం మంచిది.

Also Read: 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో సరికొత్త 5G ఫోన్.. ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×