E-Paper
Advertisement

10,000mAh బ్యాటరీ, 8000 నిట్స్ స్క్రీన్‌తో Honor Win Turbo.. ధర ఎంతో తెలిస్తే?

10,000mAh బ్యాటరీ, 8000 నిట్స్ స్క్రీన్‌తో Honor Win Turbo.. ధర ఎంతో తెలిస్తే?
Advertisement

Honor Win Turbo: ప్రముఖ టెక్ సంస్థ హానర్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ Honor Win Turbo మార్కెట్లోకి అడుగుపెట్టింది. చైనాలో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్.. అత్యాధునిక ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హెవీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ మొబైల్ విశేషాలు మీకోసం.

కొండంత బ్యాటరీ బ్యాకప్:

ఈ Honor Win Turbo ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఏకంగా 10,000mAh బ్యాటరీని అందించారు. సాధారణంగా ఫోన్లలో 5,000 లేదా 6,000mAh బ్యాటరీలే చూస్తుంటాం. కానీ, దీనిలో అంతకు రెట్టింపు సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉండటంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి వాడుకోవచ్చు. ఫోన్ ఎక్కువగా వాడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

కళ్లు చెదిరే డిస్‌ప్లే:

Advertisement

ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. Honor Win Turboలో 6.79 ఇంచుల అమోలెడ్ ఐ ప్రొటెక్షన్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. మల్టీమీడియా ప్రియులకు ఈ స్క్రీన్ చాలా బాగా నచ్చుతుంది.

Also Read: AI ఫీచర్లు, అమోలెడ్ డిస్‌ప్లే.. శాంసంగ్ కొత్త స్కెచ్.. Galaxy A27 5G లీకైన పూర్తి వివరాలివే!

పవర్‌ఫుల్ గేమింగ్ ప్రాసెసర్:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 రేసింగ్ ఎడిషన్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. దీనిలో 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు కానీ, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వదు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.

ధర ఎంత ఉండొచ్చంటే?

ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 5MP వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. నీటిలో పడినా పాడవకుండా ఉండేలా ఐపీ రేటింగ్స్ కూడా ఇచ్చారు. ఇక ధర విషయానికి వస్తే.. చైనాలో దీని ప్రారంభ ధర రూ.46,000గా ఉంది. ఇది త్వరలోనే ఇతర మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: టెక్ ప్రియులకు గోల్డెన్ ఛాన్స్.. Galaxy Z Fold 4పై ఏకంగా రూ.65వేలు తగ్గింది, స్టాక్ లిమిటెడ్ మావా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×