E-Paper
Advertisement

నిజంగా మైండ్ బ్లోయింగ్.. రొటేటింగ్ గింబాల్ కెమెరాతో Honor Robot Phone.. లాంచ్ ఎప్పుడంటే?

నిజంగా మైండ్ బ్లోయింగ్.. రొటేటింగ్ గింబాల్ కెమెరాతో Honor Robot Phone.. లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Honor Robot Phone: ఇతర బ్రాండ్ల కంటే కాస్త మెరుగ్గా సరికొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే చైనీస్ బ్రాండ్ హానర్.. ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వినూత్నమైన ఫోన్‌ను తీసుకువస్తోంది. అదే Honor Robot Phone. ఈ ఏడాది మార్చిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లోనే దీనిపై ఒక లుక్ ఇచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఈ క్రేజీ ఫోన్‌ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అసలు మన ఊహకు కూడా అందని ఒక డిజైన్‌తో ఈ ఫోన్ రాబోతోంది.

లాంచ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో, అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ రోబోట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని హానర్ సీఈఓ లి జియాన్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్వయంగా చెప్పారు. వందేళ్ల నాటి ఇమేజింగ్ సైన్స్ టెక్నాలజీని అంతా కలిపి ఈ చిన్న ఫోన్‌లో పెడుతున్నామని, ఇది మొబైల్ రంగంలోనే ఒక కొత్త రికార్డు సృష్టిస్తుందని ఆయన చాలా నమ్మకంగా చెప్పారు. ప్రముఖ కెమెరా బ్రాండ్ ARRIతో చేతులు కలిపి మరీ ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు.

రొటేటింగ్ కెమెరా మ్యాజిక్:

Advertisement

ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే.. దీని పైభాగంలో ఒక రోబోటిక్ గింబాల్ కెమెరా ఉంటుంది. సాధారణంగా మనం వీడియోలు తీసేటప్పుడు చేత్తో పట్టుకునే గింబాల్స్ ఉంటాయి కదా.. ఇది కూడా అలాగే పనిచేస్తుంది. వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు మనం ఎటు కదిలితే అటు ఈ కెమెరా కూడా ఆటోమేటిక్‌గా తిరుగుతూ మనల్ని ట్రాక్ చేస్తుంది. దీంతో మనం నడుస్తున్నా, పరిగెడుతున్నా సరే కెమెరా ఫోకస్ మాత్రం మిస్ అవ్వదన్నమాట.

వీడియోలు షేక్ అవ్వవు:

ఫోన్ కదులుతున్నా సరే వీడియోలు ఎక్కడా షేక్ అవ్వకుండా చాలా స్మూత్‌గా వచ్చేలా దీనిలో ఇండస్ట్రీలోనే బెస్ట్ స్టెబిలైజేషన్ టెక్నాలజీని వాడారు. దీనికోసం త్రీ-యాక్సిస్ మెకానికల్ గింబాల్ సిస్టమ్‌తో పాటు ఏఐ ఇంజిన్‌ను కూడా జోడించారు. ఈ టెక్నాలజీ మనం ఎటు కదులుతున్నామో ముందే ఊహించి, దానికి తగ్గట్టుగా కెమెరాను అడ్జస్ట్ చేస్తుంది.

పెద్ద బ్రాండ్లకు గట్టి పోటీ:

Advertisement

ఈ Honor Robot Phoneలో స్పిన్‌షాట్ అనే ఒక క్రేజీ మోడ్ కూడా ఉంది. దీనివల్ల ఫోన్‌ను ఒకే చేత్తో కంట్రోల్ చేస్తూ 90 డిగ్రీలు లేదా 180 డిగ్రీల యాంగిల్స్‌లో అద్భుతమైన షాట్స్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ గనుక మార్కెట్లోకి వస్తే.. రాబోయే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంటి టాప్ మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×