E-Paper
Advertisement

ఇక ఫొటోలు నెక్ట్స్ లెవెల్ అంతే.. 200MP కెమెరాతో వస్తున్న హానర్ ‘రోబోట్ ఫోన్’.. ఫీచర్లు లీక్!

ఇక ఫొటోలు నెక్ట్స్ లెవెల్ అంతే.. 200MP కెమెరాతో వస్తున్న హానర్ ‘రోబోట్ ఫోన్’.. ఫీచర్లు లీక్!
Advertisement

Honor Robot Phone: టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న హానర్ రోబోట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ ఏడాది ఆగస్టులోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2026)లో ఈ ఫోన్ గురించిన వివరాలను హానర్ వెల్లడించింది. తాజాగా దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ 6.3 నుంచి 6.4 ఇంచుల ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. దీనిలో 1.5K రిజల్యూషన్‌తో పాటు స్క్రీన్ చుట్టూ చాలా సన్నని బెజెల్స్ ఉంటాయి. అలాగే మెరుగైన పనితీరు కోసం ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. దీంతోపాటు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోసం 6,000mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది.

Advertisement

Also Read: Whatsappలో కొత్త ఫీచర్.. ఇక మీ భార్య చేతిలో తన్నులు తినక్కర్లేదు!

ఈ ఫోన్ కెమెరా విభాగానికి కంపెనీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో 4D గింబాల్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, మరో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా జోడించనున్నారు. ప్రసిద్ధ ‘అరి ఇమేజింగ్’ టెక్నాలజీని ఈ కెమెరాల్లో వాడటం విశేషం.

Advertisement

Honor Robot ఫోన్ హానర్ బ్రాండ్ నుంచి అత్యంత ఖరీదైన ప్రీమియం విభాగంలో రానుంది. దీని ధర ఎంతనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా.. రాబోయే హానర్ మ్యాజిక్ 9 సిరీస్ కంటే ముందే ఈ రోబోట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేలా కనిపిస్తోంది. సరికొత్త లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్ ప్రీమియం వినియోగదారులను బాగా ఆకట్టుకోనుంది.

Also Read: చెవులకు నొప్పి ఉండదు.. 37 గంటల బ్యాటరీతో అదరగొడుతున్న సోనీ కొత్త ఇయర్‌బడ్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×