E-Paper
Advertisement

Honor Play 80 Plus విడుదలైంది రోయ్.. 7,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16.. ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!

Honor Play 80 Plus విడుదలైంది రోయ్.. 7,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16.. ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!
Advertisement

Honor Play 80 Plus: ప్రముఖ హానర్ సంస్థ తమ Play సిరీస్‌లో మరో బడ్జెట్ ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. అదే Honor Play 80 Plus. మే 5న విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం అక్కడ ప్రీ బుకింగ్స్‌కు రెడీగా ఉంది. ముఖ్యంగా రోజంతా ఫోన్‌ వాడుతూ.. ఛార్జింగ్ అయిపోతుందని భయపడే వారి కోసం ఈ ఫోన్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారు. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉన్న ఈ హ్యాండ్ సెట్ అక్వామెరైన్, ఫ్లోటింగ్ గోల్డ్, ఇంక్‌స్టోన్ బ్లాక్ అనే మూడు క్రేజీ కలర్లలో దొరుకుతోంది.

ఈ Honor Play 80 Plus ఫోన్‌లో 6.61 అంగుళాల పెద్ద స్క్రీన్‌ను ఇచ్చారు. దీనివల్ల వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఎండలో ఉన్నా కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా మంచి బ్రైట్‌నెస్‌ను అందించారు. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అలాగే దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్ వాడారు కాబట్టి.. ఫోన్ హ్యాంగ్ అయ్యే సమస్య ఉండదు. అంతేకాదు.. మన అవసరానికి తగ్గట్టు 6GB నుంచి 12GB వరకు RAM వేరియంట్లు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: శాంసంగ్ ఫ్యాన్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన Galaxy F17 5G ధర, ఆ ఫీచర్లు, ఈ ప్రైస్.. వదులుకోవద్దు!

ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక పిల్ ఆకారంలో ఉండే మాడ్యూల్‌లో 13MP మెయిన్ కెమెరాను అమర్చారు. డే లైట్‌లో మంచి ఫొటోలు తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం 5MP కెమెరాను అమర్చారు. సెక్యూరిటీ పరంగా ఫోన్ పక్కనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. బ్యాటరీ పెద్దదైనా సరే.. ఫోన్ చూడటానికి మాత్రం చాలా స్లిమ్‌గా, పట్టుకోవడానికి కంఫర్ట్‌గా ఉంది.

Advertisement

7,500mAh బ్యాటరీ లైఫ్‌ కలిగి ఉన్న ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చు. ఇక త్వరగా ఛార్జింగ్ కావాలంటే 45W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. దీంతో పాటు 5G సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్ వంటి అన్ని రకాల లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ట్రావెలింగ్ ఎక్కువగా చేసేవారికి, అదేపనిగా ఫోన్ వాడేవారికి ఇది బాగా సెట్ అవుతుంది.

ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో రిలీజ్ అయింది. అక్కడ దీని ప్రారంభ రూ.24,000 వరకు ఉంటుంది. మిగిలిన మోడల్స్ ధరల గురించి కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే ఈ ఫోన్ భారత్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత పెద్ద బ్యాటరీ ఫోన్ వస్తే.. కచ్చితంగా ఇతర బడ్జెట్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు.

Also Read: 9020mAh బ్యాటరీ.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, iQOO Z11 గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×