E-Paper
Advertisement

గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన Honor Magic V6 ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు అమోఘం.. మీరూ ఓ లుక్కేయండి!

గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన Honor Magic V6 ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు అమోఘం.. మీరూ ఓ లుక్కేయండి!
Advertisement

Honor Magic V6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ తమ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ Honor Magic V6ను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా విడుదల చేసింది. మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే దీని ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూన్ నెలలోనే యూరప్, మిడిల్ ఈస్ట్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జరిగిన MWC 2026 ఈవెంట్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ప్రీమియం ఫోన్.. ఇప్పుడు వినియోగదారులను అలరించేందుకు సిద్ధమైంది.

అల్ట్రా స్లిమ్ డిజైన్.. భారీ బ్యాటరీ:

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లు కాస్త లావుగా ఉంటాయనే అపోహను Honor Magic V6 పటాపంచలు చేసింది. ఇది మడతపెట్టినప్పుడు కేవలం 8.75 మిల్లీ మీటరు, తెరిచినప్పుడు 4.0 మిల్లీ మీటరు మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. బరువు కూడా దాదాపు 219 గ్రాములు మాత్రమే. ఇంత సన్నగా ఉన్నప్పటికీ.. దీనిలో 6,660 mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీని అమర్చారు. ఒక ఫోల్డబుల్ ఫోన్‌లో ఇంత పెద్ద బ్యాటరీని ఇవ్వడం ఇదే మొదటిసారి. దీనికి తోడు 80W వైర్డ్ చార్జింగ్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Advertisement

Also Read: మీ ఫోన్ కెమెరా నార్మల్ దైనా.. ప్రొఫెషనల్ లాంటి ఫొటోలు తీయొచ్చు.. ఈ 5 ట్రిక్స్ తెలిస్తే చాలు!

మన్నికలో తిరుగులేదు:

ఫోన్ స్క్రీన్, హింజ్ (మడత భాగం) పాడవకుండా ఉండేందుకు హానర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందులో సరికొత్త సూపర్ స్టీల్ హింజ్, యూటీజీ ఫ్లెక్సిబుల్ గ్లాస్, నానోక్రిస్టల్ షీల్డ్ రక్షణను అందించారు. అంతేకాదు.. నీరు, ధూళి నుండి ఫోన్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను ఇచ్చారు. దీనివల్ల ఫోన్ మన్నికపై వినియోగదారులకు పూర్తి భరోసా లభిస్తుంది.

కెమెరా సెటప్ నెక్ట్స్ లెవల్:

Advertisement

ఈ ఫోన్‌లో 6.52 ఇంచుల ఔటర్ డిస్‌ప్లే, 7.95 ఇంచుల మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉన్నాయి. రెండు స్క్రీన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా పనిచేస్తాయి. అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇవి ప్రొఫెషనల్ స్థాయి ఫొటోగ్రఫీ అనుభూతిని అందిస్తాయి.

యాపిల్ ఎకోసిస్టమ్ సపోర్ట్:

స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్.. MagicOS 10పై నడుస్తుంది. అలాగే ఈ ఫోన్ Google Gemini AI ఫీచర్లతో వస్తోంది. ల్యాప్‌టాప్ తరహా మల్టీటాస్కింగ్ కోసం ఫాస్ట్ ఫ్లెక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ ఆండ్రాయిడ్ ఫోన్ యాపిల్ డివైజ్‌లతో (ఐఫోన్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్) సులువుగా కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ఫైల్స్ షేరింగ్, నోటిఫికేషన్లు చూసుకోవడం చాలా సులువవుతుంది. ప్రస్తుతం మలేషియాలో దీని ప్రారంభ ధర మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1,84,000గా ఉంది.

Also Read: యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×