E-Paper
Advertisement

Honor 200 Pro: డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Honor 200 Pro: డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?
Advertisement

Honor 200 Pro Launched: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. హానర్ తన సక్సెస్ ఫుల్ సిరీస్‌ హానర్ 200ని తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా త్వరలో Honor 200 Pro మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో కంపెనీ ఇప్పటికే హానర్ 200 లైట్‌ను విడుదల చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ హానర్ 100 తర్వాత జనరేషన్ స్మార్ట్‌ఫోన్. ఇప్పుడు దాని హానర్ 200 ప్రో చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీని ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. ఈ సిరీస్‌లోని అత్యంత అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో రాబోతున్న హానర్ 200 సిరీస్‌లో ఇది టాప్ మోడల్. ఓవరాల్‌గా ఫోన్ కెమెరా ఐలాండ్ ఫోన్‌లా కనిపిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్లు, తదితర అన్ని వివరాల గురించి తెలుసుకుందాం.

హానర్ 200 ప్రో రెండర్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఫోన్‌లో ప్రత్యేకమైన డిజైన్ కనిపిస్తుంది. ఈ రెండర్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వైరల్‌గా మరాయి. ఓ గుర్తుతెలియని అకౌంట్ నుంచి బయటకు వచ్చాయి. ఫోన్ మెయిన ఓవల్ కెమెరా  50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఉంటుంది. గ్లాస్, ఫాక్స్ లెదర్ కలర్స్‌తో ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ టోన్ కనిపిస్తుంది. కెమెరా ఐలాండ్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి.

Advertisement

Also Read: 50MP కెమెరాతో వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్.. త్వరలో లాంచ్!

హానర్ 200 ప్రో మూడు కెమెరాలలో 50X డిజిటల్ జూమ్‌ను కలిగి ఉండే పెరిస్కోప్ లెన్స్ కూడా ఉన్నాయి. ప్రధాన సెన్సార్ 50 మెగాపిక్సెల్‌లను కలిగి ఉంది. ఇది f/1.9 నుండి f/2.4 వరకు వేరియబుల్ ఎపర్చరును కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉన్నట్లు తెలిసింది. అయితే Snapdragon 8s Gen 3ని సిరీస్ వనిల్లా మోడల్ అంటే Honor 200లో చూడవచ్చు. 1.5K రిజల్యూషన్‌తో కూడిన OLED డిస్‌ప్లేను ఫోన్‌లో చూడవచ్చు.

Advertisement

Also Read: జియో బంపరాఫర్.. Netflix, Amazonతో పాటు 15 OTTల సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

హానర్ 200 ప్రో ప్రత్యేక ఫీచర్‌లో ఫోన్ ఫ్రంట్‌లో డ్యూయల్ సెల్ఫీ కెమెరాను తీసుకొచ్చారు. ఈ రెండు కెమెరాలు పిల్ ఆకారపు కటౌట్‌లలో ఉంటాయి. Honor 200, 200 Pro 3C సర్టిఫికేషన్ ప్రకారం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్లు రావొచ్చు. రెండు మోడళ్లలో 100W ఫాస్ట్ ఛార్జింగ్ చూడవచ్చు. మే నెలాఖరులో కంపెనీ ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది. భారత్‌లో మార్కెట్‌లోనూ ఈ ఫోన్ చూడొచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×