E-Paper
Advertisement

Sun: సూర్యుడికి భారీ రంధ్రం.. భూమికి ప్రమాదం! మనమెంత సేఫ్?

Sun: సూర్యుడికి భారీ రంధ్రం.. భూమికి ప్రమాదం! మనమెంత సేఫ్?
Advertisement
sun

Sun: అంతులేని అద్భుతాలకు నెలవు.. అంతరిక్షం. విశ్వాంతరాళంలోని విశేషాలను ఖగోళ శాస్త్రవేత్తలు ఒక్కొక్కటిగా ఆవిష్కరిస్తున్నారు. తాజాగా సూర్యునికి సంబంధించిన అంశం ఒకటి ఆసక్తి రేపుతోంది. నాసాకు చెందిన సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ ఇటీవల సూర్యుని బాహ్య వాతావరణంలో కరోనా అని పిలిచే భారీ ‘కరోనల్ హోల్’ని కనుగొంది. ఇది భూమి కంటే 20 రెట్లు పెద్దగా ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సూర్యుని దక్షిణార్ధగోళంలో ఉన్న కరోనాలోని ఈ గ్యాపింగ్ రంధ్రంలో… ఉష్ణోగ్రతలు దాదాపు 1.1 మిలియన్ డిగ్రీల సెల్సియస్‌కు వరకు ఉంటాయని తెలుస్తోంది. చార్జ్ అయిన కణాలను ఇది విడుదల చేస్తుంది. అవి భూమి ఉపరితలంపై కూలిపోయే అవకాశం కూడా ఉందంటోంది.. నాసా. సూర్యుని వాతావరణంలోని అవాంతరాల కారణంగా.. భూమిపై ప్రభావం చూపే పెద్ద సౌర తుఫాను సంభవించవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు… ఈ గ్యాపింగ్ హోల్ నుంచి భూమి వైపు 2.9 మిలియన్ కిలోమీటర్ల వేగంతో సౌర గాలులు వీస్తున్నాయని రీసెర్చర్స్ చెబుతున్నారు.

Advertisement

ఇలా సౌరగాలులు భూమి వైపు వచ్చినట్లయితే భూ అయస్కాంత క్షేత్రంలో కొంతవరకు తేలికపాటి కదలిక ఉండవచ్చు. భూమి వైపు ప్రయాణించే ఈ శక్తి… ధృవాలలో శక్తిమంతమైన సౌర రేఖలను సృష్టించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తర, దక్షిణ ధ్రువాల ఆకాశంలో సౌర రేఖల అధిక సంభావ్యత కనిపిస్తుంది. ఈ సౌర తుఫానుల కారణంగా భూమి బాహ్య వాతావరణం బాగా వేడెక్కుతుంది. ఇది ఉపగ్రహాలపై ప్రభావం చూపుతుంది. GPS మ్యాపింగ్, మొబైల్ ఫోన్ ప్రసారాలు, ఉపగ్రహ టెలివిజన్ సిగ్నల్‌లు అన్నీ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. పవర్ లైన్లు చాలా కరెంట్‌ను మోసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇది సర్క్యూట్‌లు పేలడానికి కారణమవుతుంది.

ఇక ప్రస్తుతం ఉన్న కరోనల్ రంధ్రం విషయానికి వస్తే.. ఇది 3 లక్షల నుంచి 4 లక్షల కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కరోనల్ రంధ్రాలు తీవ్ర అతినీలలోహిత , మృదువైన ఎక్స్-రే సోలార్ చిత్రాలలో… సౌర కరోనాలో చీకటి ప్రాంతాలుగా కనిపిస్తాయని నాసా చెబుతోంది. చుట్టుపక్కల ప్లాస్మా కంటే చల్లగా, తక్కువ సాంద్రత కలిగిన ప్రాంతాలను కరోనా రంధ్రాలుగా నాసా పేర్కొంటోంది. వీటిలో యూనిపోలార్ అయస్కాంత క్షేత్రాలు ఉండడం వల్ల అవి చీకటిగా ఉంటాయని చెబుతోంది.

Advertisement

ఈ రంధ్రాలు సూర్యునిపై ఎప్పుడైనా, ఏ ప్రదేశంలోనైనా అభివృద్ధి చెందుతాయని నాసా విశ్లేషిస్తోంది. కానీ సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద చాలా ప్రబలంగా ఉండడంతో పాటు స్థిరంగా ఉంటాయని చెబుతోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×