E-Paper
Advertisement

120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ.. HMD నుంచి 3 పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!

120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ.. HMD నుంచి 3 పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

HMD Pulse 2 Series Leaks: ప్రముఖ హెచ్‌ఎమ్‌డీ (HMD) సంస్థ త్వరలో తమ కొత్త Pulse 2 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా Pulse 2, Pulse 2 Plus, Pulse 2 Pro అనే మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటనకు ముందే ఈ ఫోన్ల ముఖ్యాంశాలు, రంగుల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యి టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

డిస్‌ప్లే, కలర్ ఆప్షన్ల వివరాలు:

లీకైన సమాచారం ప్రకారం.. Pulse 2, Pulse 2 Plus ఫోన్లు 6.67 ఇంచుల HD+ IPS LCD డిస్‌ప్లేతో రానున్నాయి. ఇందులో Pulse 2 మోడల్ 90Hz రీఫ్రెష్ రేట్‌ను, ప్లస్ మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. కలర్స్ విషయానికొస్తే Pulse 2 ఫోన్ బ్లాక్, బ్లూ రంగుల్లో రానుండగా.. Pulse 2 Plus వేరియంట్ ఆప్రికాట్, డార్క్ బ్లూ రంగుల్లో లభించే అవకాశం ఉంది.

Advertisement

Also Read: Flipkartలో రచ్చ లేపుతున్న Lava కొత్త ఫోన్లు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు బ్రో!

ప్రో మోడల్ ప్రత్యేకతలు:

ఈ సిరీస్‌లోనే Pulse 2 Pro టాప్‌ఎండ్ మోడల్‌గా రానుంది. ఇది 6.72 ఇంచుల డిస్‌ప్లేతో పాటు 90Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఇస్తున్నారు. విశేషమేమిటంటే.. అద్భుతమైన సెల్ఫీల కోసం ముందు భాగంలో ఏకంగా 50MP కెమెరాను అందించనున్నారు. ఇక మిగిలిన రెండు మోడళ్లలో వెనుక వైపు 50MP + 2MP కెమెరా సెటప్ ఉంటుంది.

ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ మూడు ఫోన్లలోనూ యూనిసాక్ T615 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. అలాగే 20W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని అందించనున్నారు. ప్రో వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో రానుండగా, Pulse 2 మోడల్ 4GB RAM, ప్లస్ మోడల్ 6GB RAM వేరియంట్లలో 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో రానున్నాయి. మిడ్‌నైట్ బ్లాక్, గ్లేసియర్ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ రంగుల్లో ప్రో మోడల్ అందుబాటులో ఉండనుంది.

Also Read: 90 డిగ్రీల రొటేషన్, కోడింగ్‌కు పర్ఫెక్ట్.. డెవలపర్ల కోసం బెన్ క్యూ సూపర్ మానిటర్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×