E-Paper
Advertisement

HiFresh Tower Fan: వావ్.. ఈ కూలర్ ఉంటే ఏసీతో పనే ఉండదట, అంత చల్లదనం ఎలా?

HiFresh Tower Fan: వావ్.. ఈ కూలర్ ఉంటే ఏసీతో పనే ఉండదట, అంత చల్లదనం ఎలా?
Advertisement

HiFresh Tower Fan: రోజురోజుకీ ఎండలు ముదురుతుండటంతో చాలామంది చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలను వెతుకుతున్నారు. సాధారణంగా కూలింగ్ అనగానే మనకు ఏసీలే గుర్తుకొస్తాయి. కానీ ఏసీ కొనడం, దాని మెయింటెనెన్స్, కరెంట్ బిల్లులు అందరికీ అందుబాటులో ఉండవు. ఇలాంటి సమయంలో మార్కెట్లోకి వచ్చిన ఈ ‘హైఫ్రెష్ 107 సెం.మీ. టవర్ ఫ్యాన్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఏసీ లాంటి చల్లదనాన్ని ఇస్తుందని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అసలు ఈ టవర్ ఫ్యాన్‌లో అంత ప్రత్యేకత ఏముంది? ఇదెలా పనిచేస్తుంది.. అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

స్టైలిష్ లుక్.. అదిరిపోయే డిజైన్..

పాతకాలపు ఎయిర్ కూలర్ల లాగా ఇది చూడటానికి అంత పెద్దగా, భారీగా ఉండదు. చాలా స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉంటుంది. మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఒక చిన్న మూలన పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఈ టవర్ ఫ్యాన్‌కి వాడిన ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పైన ఉండే ఎల్ఈడి డిస్‌ప్లే చూస్తుంటే ఒక మోడరన్ గాడ్జెట్ లాగా చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

ఐస్ ప్యాక్స్‌తో ఐస్ లాంటి కూలింగ్..

Advertisement

సాధారణ కూలర్లలో మనం ఓన్లీ నీళ్లు మాత్రమే పోస్తాం. కానీ ఈ టవర్ ఫ్యాన్ లో ఒక స్పెషల్ ఉంది. దీనితో పాటు మీకు 6 ఐస్ ప్యాక్ బాటిల్స్ ఇస్తారు. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి గడ్డకట్టిన తర్వాత కూలర్ ట్యాంక్‌లో వేస్తే చాలు.. గాలి మామూలుగా రాదు, ఏసీ నుంచి వచ్చినట్టు భలే చల్లగా వస్తుంది. ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఐస్ ప్యాక్స్ వల్ల హాయిగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట పడుకున్నప్పుడు చాలా సేపటి వరకు ఆ చల్లదనం పోదు.

Also Read: ఇండెక్షన్ స్టవ్ కొంటున్నారా? గ్యాస్‌తో పోల్చితే.. దేనికి ఎక్కువ ఖర్చవుతుంది?

అన్నీ మన చేతుల్లోనే..

Advertisement

ఈ టవర్ ఫ్యాన్‌ను ఆపరేట్ చేయడానికి పదే పదే లేవాల్సిన అవసరం లేదు. చక్కగా రిమోట్ ఇస్తారు.. కూర్చున్న చోటు నుంచే మనకు నచ్చినట్టు కంట్రోల్ చేయొచ్చు. ఇందులో మరో మంచి విషయం ఏంటంటే.. 15 గంటల వరకు టైమర్ సెట్ చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు టైమర్ పెట్టుకుంటే తెల్లవారుజామున అదే ఆగిపోతుంది. దీనివల్ల కరెంట్ ఆదా అవ్వడంతో పాటు మన నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వదు.

సైలెంట్‌గా పని చేసుకుంటుంది..

చాలామంది కూలర్లు కొనడానికి ఇష్టపడరు.. కారణం అది చేసే సౌండ్. కానీ ఈ టవర్ ఫ్యాన్ విషయంలో ఆ ప్రాబ్లం లేదు. ఇది చాలా సైలంట్‌గా పనిచేస్తుంది. మీరు టీవీ చూస్తున్నా లేదా ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా సరే.. దీని శబ్దం మీకు అసలు వినిపించదు. కాబట్టి, తక్కువ కరెంట్ బిల్లుతో, తక్కువ బడ్జెట్‌లో ఏసీ లాంటి ఫీలింగ్ కావాలనుకునే వారికి ఈ హైఫ్రెష్ టవర్ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×