E-Paper
Advertisement

ACల కంటే పవర్‌ఫుల్ గ్యాడ్జెటా? కరెంట్ ఆదా చేస్తూ ప్రకృతిని కాపాడే ఈ Heat Pumps కథేంటి?

ACల కంటే పవర్‌ఫుల్ గ్యాడ్జెటా? కరెంట్ ఆదా చేస్తూ ప్రకృతిని కాపాడే ఈ Heat Pumps కథేంటి?
Advertisement

AC vs Heat Pump: మన దగ్గరే కాదు బాబోయ్.. అటు యూరప్ దేశాల్లో కూడా ఎండలు మామూలుగా దంచికొట్టట్లేదు. మే నెలలోనే అక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఏసీలు పెట్టుకోవడం తప్ప వేరే దారే లేదని నిపుణులు కూడా తేల్చేశారు. కానీ, ఏసీలు ఎక్కువ వాడితే కరెంట్ బిల్లులు మోత మోగడమే కాదు.. పర్యావరణానికి కూడా పెద్ద ముప్పే. ఈ తరుణంలో ఇంటిని చల్లబరచడానికి ‘హీట్ పంప్స్’ అనే సరికొత్త టెక్నాలజీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి? మన ఏసీల కంటే ఇవి నిజంగానే బెటరా? కాస్త వివరంగా తెలుసుకుందాం రండి..

హీట్ పంప్ అంటే?

చాలామంది హీట్ పంప్స్ అనగానే కేవలం ఇళ్లను వేడి చేయడానికి మాత్రమే వాడతారని అనుకుంటారు. శీతాకాలంలో బయట ఉండే వేడిని లోపలికి లాగడం ద్వారా ఇవి ఇళ్లను వెచ్చగా ఉంచుతాయి. కానీ వీటిలో ‘Air-To-Air’ అనే ఒక ప్రత్యేక రకం ఉంది. ఇది శీతాకాలంలో ఇళ్లను వేడి చేయడమే కాకుండా.. ఎండాకాలంలో ఏసీ లాగా ఇళ్లలోని వేడిని బయటకు పంపి గదులను చల్లబరుస్తుంది. చిన్న ఇళ్లకు, ఫ్లాట్లకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

Advertisement

Read Also: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. iPhone 18 Pro Max ఫీచర్స్ లీక్.. లుక్, కెమెరా నెక్ట్స్ లెవెల్ అంతే!

ఏసీతో పోలిస్తే ఇదెలా ఉంటుంది?

సాధారణ ఏసీలు కేవలం గదిని చల్లబరచడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ ఈ Air-To-Air హీట్ పంప్స్ ఒకే పరికరంతో అటు చలికాలంలో వేడిని, ఇటు ఎండాకాలంలో చల్లదనాన్ని పొందొచ్చు. అయితే దీనివల్ల ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఈ సిస్టమ్ ద్వారా స్నానాలకు సరిపడా వేడి నీళ్లు రావు. దానికోసం విడిగా సోలార్ వాటర్ హీటర్ వంటివి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పైగా మార్కెట్లో వీటికి ప్రభుత్వ రాయితీలు కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి.

పర్యావరణానికి ఏది మంచిది?

Advertisement

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఏసీల వల్ల టన్నుల కొద్దీ కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఏసీల్లో వాడే గ్యాస్ భూతాపాన్ని మరింత పెంచుతోంది. హీట్ పంప్స్ కూడా చల్లబరిచేటప్పుడు కొంత వేడిని బయటకు వదిలినప్పటికీ.. పర్యావరణ పరంగా ఇవి ఏసీల కంటే కాస్త మెరుగైనవిగా భావిస్తున్నారు. ముఖ్యంగా బొగ్గు, గ్యాస్ ఆధారిత పాత హీటింగ్ పద్ధతులను పక్కన పెట్టి హీట్ పంప్స్ వైపు మారడం వల్ల కాలుష్యాన్ని చాలావరకు తగ్గించవచ్చు. అందుకే ప్రస్తుతం యూరప్‌లో వీటి అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

సహజంగా ఇంటిని చల్లబరచడం ఎలా?

అసలు ఇంట్లోకి వేడి రాకుండా చూసుకోవడమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలకు దట్టమైన తెరలు లేదా బ్లైండ్స్ వేసుకోవడం మంచిది. రాత్రిపూట వాతావరణం చల్లబడినప్పుడు మాత్రమే కిటికీలు తెరవాలి. ఇంట్లో అవసరం లేని లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కట్టేయడం ద్వారా కూడా వేడిని తగ్గించవచ్చు. మధ్యాహ్నం పూట వంట చేయడం తగ్గించి, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వండుకోవడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది.

Also Read: ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్.. iPhone 19ను స్కిప్ చేసి నేరుగా iPhone 20 లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×