E-Paper
Advertisement

Wear OS: భూకంపాన్ని ముందే చెప్పేసే స్మార్ట్ వాచ్.. ఇక ఫోన్‌తో పని లేదు, ఇది ఎలా పనిచేస్తుందంటే?

Wear OS: భూకంపాన్ని ముందే చెప్పేసే స్మార్ట్ వాచ్.. ఇక ఫోన్‌తో పని లేదు, ఇది ఎలా పనిచేస్తుందంటే?
Advertisement

Wear OS: టెక్నాలజీ మన జీవితాలను ఎంతగా మారుస్తుందో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఇప్పటివరకు మనం స్మార్ట్‌వాచ్‌లను సమయం, ఫోన్ నోటిఫికేషన్లు చూడటానికో లేదా అడుగులను లెక్కించడానికో వాడేవాళ్లం. కానీ ఇప్పుడు అదే వాచ్.. మన ప్రాణాలను కాపాడే రక్షణ కవచంగా మారింది. గూగుల్ తన Wear OS వినియోగదారుల కోసం తాజాగా అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఫోన్‌తో పనిలేదిక:

నిన్న మొన్నటి వరకు మన స్మార్ట్‌వాచ్‌కు భూకంప హెచ్చరికలు రావాలంటే.. అది కచ్చితంగా ఫోన్‌తో కనెక్ట్ అయి ఉండాల్సి వచ్చేది. ఫోన్ కూడా మన దగ్గర ఉండి, బ్లూటూత్ కూడా ఆన్‌లో ఉండాలి.  ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో ఫోన్ పక్కన లేకపోయినా లేదా ఛార్జింగ్ అయిపోయినా వాచ్‌లో అలర్ట్స్ వచ్చేవి కావు. కానీ ఇప్పుడు గూగుల్ ప్లే సర్వీసెస్ అప్‌డేట్ ద్వారా ఈ సమస్క‌కు చెక్ పెట్టింది. ఇకపై ఫోన్‌తో సంబంధం లేకుండా మన వాచ్‌కు నేరుగా భూకంప హెచ్చరికలు వస్తాయన్నమాట.

Advertisement

Also Read: మళ్లీ రాదు ఈ అవకాశం.. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లపై ఊహించని రీతిలో ధర తగ్గింపు!

ఇదెలా పనిచేస్తుంది? 

గూగుల్ తన ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆండ్రాయిడ్ ఫోన్లలోని చిన్న చిన్న సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఎక్కడైనా భూమిలో అసాధారణ కదలికలు మొదలైనప్పుడు, ఆ ఫోన్లు వెంటనే సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపిస్తాయి. సర్వర్లు ఆ డేటాను విశ్లేషించి, భూకంపం వచ్చే అవకాశం ఉందని నిర్ధారిస్తే.. వెంటనే ఆ ప్రాంతంలోని వాచ్‌లకు నేరుగా హెచ్చరికలను పంపిస్తాయి.

ప్రాణాలు కాపాడే ఆ కొన్ని సెకన్లు:

Advertisement

భూకంపం సంభవించడానికి కొన్ని సెకన్ల ముందే మీ వాచ్ వైబ్రేట్ అవుతూ హెచ్చరికను చూపిస్తుంది. ఆ కొద్దిపాటి సమయం మనకు ఎంతో విలువైనది. ఆ సమయంలో కిటికీలకు దూరంగా వెళ్లడం, టేబుల్ కింద దాక్కోవడం లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం వంటివి చేసి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయం:

ఈ ఫీచర్ పని చేయాలంటే మీ స్మార్ట్‌వాచ్‌కు నేరుగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. అంటే.. LTE సపోర్ట్ ఉన్న వాచ్‌లు లేదా Wi-Fiకి కనెక్ట్ అయి ఉన్న వాచ్‌లలో మాత్రమే ఇది పనిచేస్తుంది. మీ వాచ్‌లో గూగుల్ ప్లే సర్వీసెస్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ సేఫ్టీ ఫీచర్‌ను పొందవచ్చు.

Also Read: ఇది కలా.. నిజమా? అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై రూ.32,000 ఫ్లాట్ డిస్కౌంట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×