E-Paper
Advertisement

ChatGPT:చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ కొత్త ఫీచర్..

ChatGPT:చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ కొత్త ఫీచర్..
Advertisement

ChatGPT:గూగుల్ అనేది దాదాపు గత 30 సంవత్సరాలుగా పోటీ లేని సెర్చ్ ఇంజన్‌గా దూసుకుపోతోంది. ఎన్నో టెక్ సంస్థలు గూగుల్‌కు పోటీగా సెర్చ్ ఇంజన్లను లాంచ్ చేసినా.. గూగుల్ తెచ్చిపెట్టినట్టుగా అవి లాభాలు తెచ్చిపెట్టలేకపోయాయి. కానీ తాజాగా వచ్చిన చాట్ జీపీటీ మాత్రం భారీ పబ్లిసిటీతో లాంచ్ అయ్యి ఇప్పటికే టెక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అందుకే గూగుల్ కూడా దాని పోటీని తట్టుకోవడానికి కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయాలని సన్నాహాలు చేస్తోంది.

మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన చాట్ జీపీటీ.. చాట్‌బోట్ అనే కృత్రిమ మేధస్సు ఫీచర్‌ను ఉచితంగా యూజర్లకు అందిస్తోంది. దీని ద్వారా యూజర్లు చాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. గూగుల్ కూడా ఈ చాట్‌బోట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలల తర్వాత.. లేదా కుదిరితే కొన్ని వారాలలోనే గూగుల్ తన సొంత చాట్‌బోట్‌తో యూజర్లను అలరించనున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచై ఈ విషయంపై తన ఆలోచనలను బయటపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది టెక్ ప్రపంచంలో తారాస్థాయికి చేరుకుంది. గూగుల్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన బయటపెట్టారు. అందుకే దీనికి సంబంధించి లాఎమ్డీఏ, పాల్మ్ అనే రెండు లాంగ్వేజ్ మోడల్స్‌ను కూడా గూగుల్ తయారు చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అందులో ఒకటి యూజర్లకు అందుబాటులోకి రానుంది.

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ లాంచ్ చేయనున్న చాట్‌బోట్‌కు అప్రెంటిస్ బార్డ్ అని పేరు పెట్టారు. లాఎమ్డీఏ లాంగ్వేజ్‌తో ఈ ఫీచర్‌ను డెవలప్ చేశారు. సెర్చ్ ఇంజన్‌ను మరింత మెరుగైనరీతిలో యూజర్లకు అందిస్తామని పిచై హామీ ఇచ్చారు. చాట్ జీపీటీ అనేది విడుదలయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో టెక్ కంపెనీల మాత్రం చిచ్చు రగిలిందని అందుకే కంపెనీలు అన్నీ కొత్త ఫీచర్లను అందించడానికి పోటీపడుతున్నాయని అని నిపుణులు అంటున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×