E-Paper
Advertisement

ఫిట్‌నెస్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్.. గూగుల్ పిక్సెల్ వాచ్ ఆఫర్ ధరలోనే !

ఫిట్‌నెస్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్.. గూగుల్ పిక్సెల్ వాచ్ ఆఫర్ ధరలోనే !
Advertisement

Google Pixel Watch 2: స్మార్ట్ వాచ్‌ ప్రపంచంలో గూగుల్ పిక్సెల్ వాచ్ 2 ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ వాచ్ ప్రస్తుతం టెక్ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ.. లేటెస్ట్ టెక్నాలజీని ఇష్టపడే వారైతే.. పిక్సెల్ వాచ్ 2 మీకు బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో ప్రీమియం ఫీల్ అందించే ఈ స్మార్ట్ వాచ్ గురించి పూర్తి వివరాలు.. స్పెసిఫికేషన్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్ అనేది కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక వ్యక్తిగత డాక్టర్. గూగుల్ పిక్సెల్ వాచ్ 2 ఆ బాధ్యతను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది.

Advertisement

డిజైన్, డిస్‌ప్లే:
పిక్సెల్ వాచ్ 2 రౌండ్ డయల్ షేప్‌తో వస్తుంది. అల్యూమినియం బాడీతో తయారు చేసిన ఈ వాచ్ చాలా తేలికగా.. ప్రీమియంగా ఉంటుంది. ఇందులోని అద్భుతమైన AMOLED డిస్‌ప్లే ఎండలో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దీని స్ట్రాప్స్ మార్చుకునే అవకాశం ఉండటం వల్ల మీరు మీ డ్రెస్‌కు తగ్గట్టుగా స్టైల్ మార్చుకోవచ్చు.

హెల్త్ ,ఫిట్‌నెస్ ఫీచర్లు:
ఈ వాచ్‌లో ఉన్న సెన్సార్లు చాలా పవర్‌ఫుల్.

Advertisement

ECG మానిటర్: గుండె లయను పర్యవేక్షించవచ్చు.

SpO2 సెన్సార్: రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

స్కిన్ టెంపరేచర్ సెన్సార్: మీ శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేస్తుంది.

హార్ట్ రేట్ సెన్సార్: మల్టీ-పాత్ ఆప్టికల్ సెన్సార్ ద్వారా కచ్చితమైన రీడింగ్స్ అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది?
క్వాల్కమ్ 5100 ప్రాసెసర్‌తో పనిచేసే.. ఈ వాచ్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. 2GB ర్యామ్ , 32GB ఇంటర్నల్ మెమరీ ఉండటం వల్ల మీరు యాప్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. బ్లూటూత్ 5.0 వెర్షన్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉండటం వల్ల రోజంతా మీరు దీనిపై ఆధారపడవచ్చు.

అదనపు ప్రత్యేకతలు:
5 ATM వాటర్ రెసిస్టెంట్: వర్షంలో లేదా స్విమ్మింగ్ పూల్‌లో కూడా వాచ్‌ను నిరభ్యంతరంగా వాడవచ్చు.

స్పీకర్, మైక్రోఫోన్: వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు.

అలారం, క్యాలెండర్, కంపాస్: రోజువారీ పనులకు ఎంతో ఉపయోగపడతాయి.

ధర:
ప్రస్తుతం భారత మార్కెట్లో Google Pixel Watch 2 ధర రూ. 22,990 గా ఉంది.ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో కాలానుగుణంగా లభించే బ్యాంక్ ఆఫర్స్ , డిస్కౌంట్ల ద్వారా మీరు దీన్ని ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×