E-Paper
Advertisement

Google Pixel phone: వామ్మో.. పిక్సెల్ ఫోన్లలో ఇంతపెద్ద సెక్యూరిటీ లోపమా? ఈ సెట్టింగ్ మార్చకపోతే మీ డేటా ప్రమాదంలో పడ్డట్టే!

Google Pixel phone: వామ్మో.. పిక్సెల్ ఫోన్లలో ఇంతపెద్ద సెక్యూరిటీ లోపమా? ఈ సెట్టింగ్ మార్చకపోతే మీ డేటా ప్రమాదంలో పడ్డట్టే!
Advertisement

Google Pixel phone: మనందరికీ తెలిసిన కామన్ విషయం ఏమిటంటే.. మన వ్యక్తిగత డేటా మొత్తం మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లోనే ఉంటుందని. కానీ, మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మన ఇంట్లో మాటలు అవతలి వారికి వినిపిస్తే? వినడానికే కాస్త భయంగా ఉంది కదా. ఇలాంటి సమస్యే ఇప్పుడు Google Pixel యూజర్లకు ఎదురవుతోంది. మీరు పిక్సెల్ ఫోన్ వాడుతున్నట్లయితే.. మీ ప్రైవసీ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఆ వివరాలేంటి? మీ ఫోన్‌లో వెంటనే మార్చుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి? మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఆ ఫీచర్ వల్లేనా?

9To5Google నివేదిక ప్రకారం.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలోని ‘Take a Message’ అనే ఫీచర్ వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. సాధారణంగా మనం ఏదైనా కాల్ కట్ చేసినప్పుడు లేదా లిఫ్ట్ చేయనప్పుడు.. ఈ ఏఐ ఫీచర్ యాక్టివేట్ అయ్యి అవతలి వారు చెప్పే సందేశాన్ని రికార్డ్ చేస్తుంది. అయితే, ప్రస్తుతం దీనిలో ఒక బగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా, మీ ఫోన్ మైక్రోఫోన్ ఆన్ అయ్యి మీ చుట్టూ ఉన్న శబ్దాలను అవతలి వ్యక్తికి వినిపించేలా చేస్తోంది. అంటే.. మీరు ఫోన్ మాట్లాడకపోయినా, మీ పక్కన ఏం జరుగుతుందో అవతలి వారికి తెలిసిపోయే ప్రమాదం ఉందన్నమాట.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. 50MP కెమెరాతో వస్తోన్న కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే!

అసలు సమస్య ఏమిటి?

గూగుల్ పిక్సెల్ ఫోన్‌లోని టేక్ ఏ మెసేజ్ ఫీచర్ వల్ల కొంతమంది యూజర్లు వింత అనుభవాలను ఎదుర్కొన్నారు. కాల్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఫోన్ స్క్రీన్ పైభాగంలోGreen mic indicator కనిపిస్తోందని చాలామంది ఇప్పటికే సమస్యను గుర్తించారు. ఈ బగ్ కారణంగా ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉండటంతో.. గూగుల్ ఇప్పటికే దీనిపై దృష్టి సారించింది. ఈ సమస్య చాలా అరుదుగా కనిపిస్తున్నప్పటికీ, భద్రత దృష్ట్యా వినియోగదారులు అలర్ట్‌గా ఉండటం మంచిది.

ఏయే మోడల్స్‌పై ప్రభావం?

Advertisement

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇది ఏదో ఒక మోడల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. పాత పిక్సెల్ ఫోన్ల నుండి లేటెస్ట్ మోడల్స్ వరకు చాలామంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గూగుల్ దీనికి సంబంధించి అధికారికంగా అప్డేట్ ఇచ్చే వరకు.. ఈ ఫీచర్‌ను తాత్కాలికంగా ఆపేయడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

సెట్టింగ్స్ ఇలా మార్చుకోండి..

మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే.. ముందుగా మీ పిక్సెల్ ఫోన్‌లోని Phone యాప్‌ను ఓపెన్ చేయండి. కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేసి Settings లోకి వెళ్లండి. అక్కడ మీకు Call Assist విభాగంలో Take a Message అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని డిసేబుల్ చేసేయండి. ఇలా చేయడం వల్ల పొరపాటున కూడా మీ మైక్రోఫోన్ ఫోన్ మాట్లాడే సమయంలో ఆన్ అవ్వదు. గూగుల్ నుండి కొత్త అప్‌డేట్ వచ్చే వరకు ఈ జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.

Also Read: 1930ల నాటి క్లాసిక్ లుక్.. 2026 క్రేజీ ఫీచర్స్.. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఫుజిఫిల్మ్ నయా సెన్సేషన్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×