E-Paper
Advertisement

మీరు ఏ పాట విన్నారో, ఏం మాట్లాడారో గుర్తుంచుకునే Pixel AI ఫీచర్.. మరి ప్రైవసీ సంగతేంటి?

మీరు ఏ పాట విన్నారో, ఏం మాట్లాడారో గుర్తుంచుకునే Pixel AI ఫీచర్.. మరి ప్రైవసీ సంగతేంటి?
Advertisement

Google Pixel Audio Memory: గూగుల్ తమ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఏఐ ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ‘ఆడియో మెమరీ’ పేరుతో రాబోతున్న ఈ ఫీచర్ ద్వారా రోజంతా మనం వినే పాటలతో పాటు ముఖ్యమైన సంభాషణలను కూడా సులభంగా గుర్తుంచుకోవచ్చు. ప్రస్తుతం పిక్సెల్ ఫోన్లలో ఉన్న ‘నౌ ప్లేయింగ్’ ఫీచర్‌కు ఇది మరింత అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు.

కొత్త ఫీచర్ వెనుకున్న కథ:

ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ యాప్‌లోని కోడింగ్‌ను పరిశీలించినప్పుడు ఈ సరికొత్త ఫీచర్ వివరాలు బయటకు వచ్చాయి. గూగుల్ దీనికి ‘బ్లూఫ్లాక్స్’ అనే కోడ్ నేమ్ పెట్టింది. రాబోయే పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఈ టెక్నాలజీని మొదటిసారిగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: షాకింగ్.. రూ.41,000 తగ్గిన Samsung Galaxy Z Flip 5 ఫోన్ ధర.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఇదెలా పనిచేస్తుందంటే?

మన చుట్టుపక్కల వినిపించే పాటలను గుర్తించడమే కాకుండా.. మన ఫోన్‌లోని రకరకాల యాప్స్ ద్వారా వినే ఆడియోను కూడా ఇది ట్రాక్ చేస్తుంది. వాటన్నింటినీ కలిపి ఒక టైమ్‌లైన్ లాగా భద్రపరుస్తుంది. కేవలం సంగీతమే కాకుండా, మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలను కూడా గుర్తుంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఏ యాప్‌లకు ఈ అనుమతి ఇవ్వాలనేది పూర్తిగా వినియోగదారుల చేతుల్లోనే ఉంటుంది.

ప్రైవసీకి పెద్ద పీట:

Advertisement

వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రత విషయంలో గూగుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ ఫీచర్ ద్వారా సేకరించే డేటా అంతా ఫోన్‌లోనే ప్రాసెస్ అవుతుంది. ఏదైనా పాటను ఫోన్ గుర్తించలేనప్పుడు మాత్రమే, చిన్న ఆడియో ఫింగర్‌ప్రింట్‌ను గూగుల్ క్లౌడ్‌కు పంపుతుంది. మిగిలిన సంభాషణలు ఏవీ గూగుల్ సర్వర్లకు చేరవు, ఫోన్‌ను దాటి బయటకు వెళ్లవు.

అందుబాటులోకి ఎప్పుడంటే?

ప్రస్తుతం ఈ ఆడియో మెమరీ ఫీచర్ ప్రాథమిక అభివృద్ధి దశలోనే ఉంది. ప్రయోగాత్మకంగా ఇది పనిచేస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి వచ్చేసరికి మరికొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా, ప్రైవసీకి భంగం కలగకుండా గూగుల్ తీసుకురాబోతున్న ఈ ఏఐ ఫీచర్ పిక్సెల్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

Also Read: 8000mAh బ్యాటరీ, ఇన్‌-బిల్ట్ ఫ్యాన్‌తో రెడ్‌మి కొత్త ఫోన్.. ఫీచర్లు అరాచకం బాబోయ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×